ఐపిఎల్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్: సౌరవ్ గంగూలీ వివరణ ఇదీ....

By telugu team  |  First Published Mar 4, 2020, 10:47 AM IST

ఐపిఎల్ పై కరోనా వైరస్ ప్రభావం పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ బ్రిజెష్ పటేల్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చారు.


ముంబై: కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో ప్రారంభమైన ఈ వ్యాధి ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా పాకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విదేశీ ఆటగాళ్లు పాల్గొనే ఐపిఎల్ నిర్వహణపై సందేహాలు తలెత్తాయి. 

ఆ విషయంపై ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందించారు. ఐపిఎల్ పై కరోనా ప్రభావం ఉండదని, షెడ్యూల్ ప్రకారమే ఐపిఎల్ ను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఐపిఎల్ 13వ సీజన్ మార్చి 29వ తేదీన ప్రారంభమై మే 24వ తేదీతో ముగుస్తుంది. 

Latest Videos

undefined

Also Read: నేను కొట్టింది హెలికాప్టర్ షాటేనా: రషీద్ ఖాన్ వీడియో వైరల్

బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఐపిఎల్ నిర్వహణపై స్పందించారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్, ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. కరోనా వల్ల భారత్ లో ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ గురించి చర్చించలేదని చెప్పారు 

మూడు వన్జేల సిరీస్ ఆడడానికి దక్షిణాఫ్రికా జట్టు భారత్ కు వస్తుందని బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు. టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా మార్చి 12వ తేదీన తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15వ తేదీన రెండో వన్డే, కోల్ కతాలోని ఈడెన్ గార్జెన్స్ వేదికగా మార్చి 18వ తేదీన మూడో వన్డే జరుగుతాయి.

click me!