రేపటి నుంచి ఆసియా కప్ 2023... ఫ్రీగా లైవ్ మ్యాచులు చూసే అవకాశం! ఎప్పుడు, ఎక్కడ, ఎలా...

Published : Aug 29, 2023, 04:07 PM IST
రేపటి నుంచి ఆసియా కప్ 2023... ఫ్రీగా లైవ్ మ్యాచులు చూసే అవకాశం! ఎప్పుడు, ఎక్కడ, ఎలా...

సారాంశం

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఉచితంగా ఆసియా కప్ 2023 ప్రత్యేక్ష ప్రసారాలు.. సెప్టెంబర్ 2న ఇండియా - పాకిస్తాన్ మధ్య పల్లెకెలెలో మ్యాచ్..

ఆసియా కప్ 2023 ఆరంభానికి ఇంకా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత సరైన మ్యాచులు లేక, చప్పగా సాగుతున్న మ్యాచులు చూడలేక బోర్ ఫీలైన క్రికెట్ ఫ్యాన్స్... ఆసియా కప్‌ నుంచి మళ్లీ క్రికెట్ మజాని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నారు...

ఆసియా కప్ 2023 మ్యాచులన్నీ ఫ్రీ! 

జియో దెబ్బకు ఐపీఎల్ మొబైల్ ప్రసార హక్కులు కోల్పోయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్, కొన్ని నెలల వ్యవధిలోనే కోట్ల మంది సబ్‌స్కైబర్లను కోల్పోవాల్సి వచ్చింది. మార్చి 2023 నుంచి 6 నెలల కాలంలో దాదాపు 2 కోట్ల మంది మొబైల్ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌ని డిలీట్ చేసేశారు..

దీంతో ఇక లాభం లేదని ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులను ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది హాట్ స్టార్. అయితే ఆసియా కప్ లైవ్ మ్యాచులు చూడాలంటే మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది...

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ హిందీ, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెళ్లలో ఆసియా కప్ మ్యాచులు ప్రత్యేక్ష ప్రసారం చూడొచ్చు. కన్నడ, తమిళ్ భాషల్లోనూ లైవ్ కామెంటరీ అందిస్తోంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్..

అన్నీ డే నైట్ మ్యాచులే...

ఆసియా కప్ 2023 టోర్నీలో మ్యాచులన్నీ డే-నైట్‌ గేమ్స్‌గానే జరగబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. టాస్ సమయం 2 గంటల 30 నిమిషాలు..

షెడ్యూల్ ఇది..
ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్తాన్ - నేపాల్ మధ్య ఆసియా కప్ 2023 ఆరంభ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్టు 31న శ్రీలంకలోని పల్లెకెలెలో బంగ్లాదేశ్ - శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. సెప్టెంబర్ 1న మ్యాచులేమీ లేవు. 

ఆగస్టు 30న నేపాల్‌తో మ్యాచ్ ఆడే పాకిస్తాన్, శ్రీలంకకు చేరుకుని, సెప్టెంబర్ 2న ఇండియాతో మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 3న బంగ్లాదేశ్ - ఆఫ్ఘాన్ మధ్య లాహోర్‌లో, సెప్టెంబర్ 4న టీమిండియా - నేపాల్ మధ్య పల్లెకెలెలో మ్యాచులు జరుగుతాయి. 

సెప్టెంబర్ 5న ఆఫ్ఘాన్- శ్రీలంక మధ్య లాహోర్‌లో జరిగే మ్యాచ్‌తో గ్రూప్ మ్యాచులు ముగుస్తాయి...

ఆ తర్వాత లాహోర్‌లో ఓ సూపర్ 4 మ్యాచ్ జరుగుతుంది. మిగిలిన సూపర్ 4 మ్యాచులు, ఫైనల్ మ్యాచ్ కొలంబో వేదికగా జరుగుతుంది. గ్రూప్ Aలో ఉన్న ఇండియా, పాకిస్తాన్.. పసికూన నేపాల్‌పైన గెలిస్తే సెప్టెంబర్ 10న కొలంబోలో సూపర్ 4 మ్యాచ్ ఆడతాయి. సెప్టెంబర్ 6, 9, 10, 12, 14, 15 తేదీల్లో సూపర్ 4 రౌండ్ మ్యాచులు ఉంటాయి.   సూపర్ 4 రౌండ్‌లో టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 17న ఫైనల్ జరుగుతుంది.

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !