కివీస్ వర్సెస్ ఇండియా: శ్రేయస్ అయ్యర్ రికార్డు

By telugu teamFirst Published Feb 11, 2020, 3:06 PM IST
Highlights

న్యూజిలాండ్ పై మూడో వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అర్థ సెంచరీల్లో అత్యదిక సగటు సాధించిన క్రీడాకారుడిగా అతను రికార్డు సృష్టించాడు.

మౌంట్ మాంగనూయ్: న్యూజిలాండ్ పై ఆఖరి వన్డేలో టీమిండియా బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ ఓ రికార్డు సొంతం చేసుకున్నిాడు. పది కన్నా ఎక్కువ మ్యాచులలో అత్యధిక అర్థ సెంచరీల సగటు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు.  16 మ్యాచులు ఆడిన శ్రేయస్ 9 అర్థ సెంచరీలు చేశాడు. దాంతో అత్యధిక అర్థ సెంచరీల ద్వారా 56.25 సగటు నమోదు చేశాడు. 

ఆ తర్వాతి స్థానాల్లో ఇయాన్ చాపెల్ ఉన్నాడు. అతను 16 మ్యాచులలో 8, అకిబీ ఇలియాస్ 10 మ్యాచుల్లో 5 అర్థ సెంచరీలు చేశారు. వారి సగటు శ్రేయస్ అయ్యర్ సగటుకన్నా తక్కువగా ఉంది. 

న్యూజిలాండ్ పై మ్యాచులో శ్రేయస్ అయ్యర్ 63 బంతుల్లో 62 పరుగులు చేసి నీషమ్ బౌలింగులో అవుటయ్యాడు. ఇందులో 4 ఫోర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ తో కలిసి శ్రేయస్ 100 పరుగులు జోడించాడు. భారత్ ఇన్నింగ్సును నిర్మించడంలో వీరే కీలక భూమిక పోషించారు. 

భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) తీవ్రంగా నిరాశపరించారు. పృథ్వీ షా మాత్రం ఫరవా లేదనిపించాడు. 42 బంతుల్లో 40 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. అతను 3 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. 

న్యూజిలాండ్ తొలి రెండు వన్డేలు గెలిచి ఇప్పటికే మూడు మ్యాచుల సిరీస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తుంది. టీ20ల సిరీస్ భారత్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

click me!