థాంక్యూ.. థాంక్యూ.. ఏం చెప్పగలం ఇంతకన్నా.. బీసీసీఐకి టీమిండియా ఫ్యాన్స్ కృతజ్ఞతలు.. కారణమిదే..

Published : Mar 01, 2023, 12:06 PM IST
థాంక్యూ.. థాంక్యూ.. ఏం చెప్పగలం ఇంతకన్నా.. బీసీసీఐకి టీమిండియా ఫ్యాన్స్ కృతజ్ఞతలు.. కారణమిదే..

సారాంశం

INDvsAUS Live Score: భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో  టీమిండియా తుది జట్టును ప్రకటించాక అభిమానుల ఆనందం  అంతా ఇంతా కాదు.  వారి ఆనందానికి కారణమేంటంటే... 

ఇండోర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో   టీమిండియా   స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. అయితే ఈ మ్యాచ్ లో  టాస్ కు వచ్చేప్పుడు రోహిత్ శర్మ  తుది జట్టు గురించి ప్రకటించగానే  భారత క్రికెట్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.  వారి ఆనందానికి కారణం కెఎల్ రాహుల్ ను టీమ్ నుంచి తొలగించడం..  దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజనులు.. ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం...’అనుకుంటూ పాటలు పాడుకుంటున్నారు. 

గత కొన్నాళ్లుగా టెస్టులలో దారుణ ప్రదర్శనలతో విఫలమవుతున్న   రాహుల్ ను తొలగించాలని  టీమిండియా ఫ్యాన్స్ తో పాటు  మాజీ క్రికెటర్లు కూడా గళమెత్తిన విషయం తెలిసిందే. రాహుల్ స్థానంలో గిల్ ను  ఆడించాలని  డిమాండ్ చేస్తూ  వెంకటేశ్ ప్రసాద్ అయితే ట్విటర్ వేదికగా ఓ చిన్నపాటి పోరాటమే చేశాడు. 

ప్రసాద్ పోరాట ఫలితమో టీమిండియా అభిమానుల   ప్రార్థనలు ఫలించాయో తెలియదు గానీ  ఇండోర్ లో   టీమిండియా రాహుల్ ను బెంచ్ కే పరిమితం చేసింది. అతడి స్థానంలో గిల్ ను ఆడిస్తున్నది. ఈ విషయం తెలియగానే ట్విటర్ లో మీమ్స్ హోరెత్తాయి. ఆడినా ఆడకున్నా ట్విటర్ లో ట్రెండ్ అయ్యే స్టార్ లలో కెఎల్ రాహుల్ కూడా ఉంటాడు.    ఇండోర్ టెస్టులో చోటు కోల్పోయాక  రాహుల్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చాడు. 

 

పలువురు అభిమానులు  ట్విటర్ లో.. ‘థాంక్యూ బీసీసీఐ.. థాంక్యూ.. ఏం చెప్పగలం అంతకంటే..’, ‘అబ్బ సాయిరాం.. మా పూజలు ఇన్నటికి ఫలించాయి.. ’, ‘మేం  కోరుకునేది ఇదే.. ఇప్పటికీ మమ్మల్ని కరుణించారా..’  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి సినిమాలో ప్రభాస్  రాజ్యాన్ని వదిలివెళ్లేప్పుడు.. ‘ఏడుస్తారెందుకురా,  ఇది పండుగ చేసుకోవాల్సిన సందర్భం..’  డైలాగ్ ను రాహుల్ కు అన్వయిస్తూ  మీమ్స్ తో  హల్చల్ చేస్తున్నారు.  ఇందుకు సంబంధించిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

 

కాగా  మూడో టెస్టులో టీమిండియా తడబడుతోంది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి భారత జట్టు.. లంచ్ విరామం సమయానికి 7 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ (12), శుభ్‌మన్ గిల్ (21), విరాట్ కోహ్లీ (22), పుజారా (1), రవీంద్ర జడేజా (4), శ్రేయాస్ అయ్యర్ (0), శ్రీకర్ భరత్ (17) లు  అలా వచ్చి ఇలా వెళ్లారు.  ప్రస్తుతం  అశ్విన్ (1 నాటౌట్) తో కలిసి అక్షర్ పటేల్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ నిలిస్తేనే తొలి ఇన్నింగ్స్ లో భారత్ గౌరవప్రదస్కోరు చేసే అవకాశముంది. 

 

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర