చరిత్ర సృష్టించిన నేపాల్... వన్డే వరల్డ్ కప్‌కి అర్హత! క్వాలిఫైయర్‌ మ్యాచ్‌కి లక్షల మంది జనం...

Published : Mar 17, 2023, 05:23 PM IST
చరిత్ర సృష్టించిన నేపాల్... వన్డే వరల్డ్ కప్‌కి అర్హత! క్వాలిఫైయర్‌ మ్యాచ్‌కి లక్షల మంది జనం...

సారాంశం

అసోసియేట్ దేశం తరుపున అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా అసిఫ్ ఖాన్ చరిత్ర.. DLS పద్ధతి ప్రకారం యూఏఈపై గెలిచి, వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ రౌండ్‌కి దూసుకెళ్లిన నేపాల్.. 

నేపాల్ క్రికెట్ జట్టు, మొట్టమొదటిసారి వన్డే వరల్డ్ కప్‌కి అర్హత సాధించింది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్‌ రౌండ్‌కి అర్హత సాధించాలంటే 12 మ్యాచుల్లో 11 మ్యాచులు గెలవాల్సిన స్థితిలో ఉన్న నేపాల్, అద్భుత ఆటతీరుతో అన్ని అవరోధాలను అధిగమించింది.  ఐసీసీ క్రికెటర్ వరల్డ్ కప్ లీగ్ టూ 2019-23 రౌండ్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో యూఏఈ జట్టుపై 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది నేపాల్..

కీర్తిపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ని చూసేందుకు లక్షలాది మంది జనం త్రిబువన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌కి తరలివచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 310 పరుగుల భారీ స్కోరు చేసింది. యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం 49 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 63 పరుగులు చేయగా విత్యా అరవింద్ 138 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు...

అయితే అర్యన్ లక్రా 6, అఫ్జల్ ఖాన్ 3, రిజ్వాన్ 7 పరుగులు చేసి అవుట్ కావడంతో 175 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది యూఏఈ. అయితే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అసిఫ్ ఖాన్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు.. అసోసియేట్ దేశం తరుపున అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా అసిఫ్ ఖాన్ చరిత్ర లిఖించాడు..

311 పరుగుల భారీ లక్ష్యఛేదనలో అసిఫ్ షేక్ 0, కుశాల్ మల్ల 5 వికెట్లు త్వరగా కోల్పోయింది నేపాల్. కుశాల్ బుటెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేయగా కెప్టెన్ రోహిత్ పౌదెల్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భీం శక్తి 76 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేయగా అరిఫ్ షేక్ 62 బంతుల్లో 2 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. గుల్షాన్ జా 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా దీపేంద్ర సింగ్ అరీ 10 పరుగులతో క్రీజులో ఉన్నప్పుడు వర్షం పడింది..

వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 44 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది నేపాల్. డీఎల్‌ఎస్ విధానం ప్రకారం 44 ఓవర్లలో చేయాల్సిన పరుగుల కంటే 9 పరుగులు ఎక్కువగా నేపాల్.. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ రౌండ్‌కి అర్హత సాధించింది...

నేపాల్‌తో పాటు ఓమన్, స్కాట్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లు ఇప్పటికే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ రౌండ్‌కి అర్హత సాధించాయి. వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్ 8 టీమ్స్ నేరుగా గ్రూప్ స్టేజీకి అర్హత సాధించాయి. కింద ఉన్న జట్లు, వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఆడి.. సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించాల్సి ఉంటుంది...

9వ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా, 10వ స్థానంలో ఉన్న శ్రీలంకలతో పాటు ఐర్లాండ్ కూడా గ్రూప్ క్వాలిఫైయర్స్ ఆడనుంది. 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్‌ కూడా మ్యాచులు ఓడిపోతే క్వాలిఫైయర్స్ ఆడాల్సి రావచ్చు. దీంతో నేపాల్ తొలిసారిగా శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వంటి టీమ్స్‌తో మ్యాచులు ఆడబోతోంది.. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !