Khel Ratna: ఒలింపిక్ వీరులకు ఖేల్ రత్న.. హాకీ యోధులకు అర్జున అవార్డుల పంట.. ఈనెల 13న అందజేత

By team teluguFirst Published Nov 2, 2021, 10:46 PM IST
Highlights

National Sports Awards 2021: ఒలింపిక్స్ లో భారత స్వర్ణ పతక కాంక్షను నెరవేర్చిన నీరజ్ చోప్రాతో పాటు మరో 11 మందికి ఈసారి దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దక్కనున్నది.

టోక్యో ఒలింపిక్స్ లో  భారత్ కు పతకాల పంట పండించిన  క్రీడాకారులకు ఈసారి క్రీడా పురస్కారాలలో పెద్ద పీట వేశారు. భారత స్వర్ణ పతక కాంక్షను నెరవేర్చిన నీరజ్ చోప్రాతో పాటు మరో 11 మందికి ఈసారి దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దక్కనున్నది. ఖేల్ రత్న తో పాటు ఈ ఏడాదికి గాను అర్జున అవార్డుల జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న-2021 విజేతలు వీళ్లే.. 

1. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్) 2. రవి  కుమార్ దహియా (రెజ్లింగ్), 3. లవ్లీనా బోర్గో హైన్ (బాక్సింగ్), 4. శ్రీజేష్ (హాకీ), 5. ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), 6. సుమిత్ అంటిల్ (పారా బ్యాడ్మింటన్), 7. అవని లేఖరా (పారా షూటింగ్), 8. కృష్ణ నాగర్ (పారా బ్యాడ్మింటన్), 9. మనీశ్ నర్వాల్ (పారా షూటింగ్), 10. మిథాలీ రాజ్ (క్రికెట్), 11. సునీల్ ఛెత్రి (ఫుట్ బాల్), మన్ ప్రీత్ సింగ్ (హాకీ) 

అర్జున అవార్డుల జాబితా..

1. అర్పిందర్ సింగ్ (అథ్లెటిక్స్) 2. సిమ్రన్ జిత్ కౌర్ (బాక్సింగ్) 3. శిఖర్ ధావన్ (క్రికెట్) 4. భవానీ దేవి (ఫెన్సింగ్) 5. మోనికా (హాకీ) 6. వందన కటారియా (హాకీ) 7. సందీప్ నర్వాల్ (కబడ్డీ) 8. హిమాని ఉత్తమ్ పరబ్ (షూటింగ్) 9. అభిషేక్ వర్మ (షూటింగ్) 10. అంకితా రైనా (టెన్నిస్) 11. దీపికా పునియా (రెజ్లింగ్) 12. హర్మన్ ప్రీత్ సింగ్ (రెజ్లింగ్) 13. దిల్ ప్రీత్ సింగ్ (హాకీ) 14. రూపిందర్ పాల్ సింగ్ (హాకీ) 15. సురేందర్ కుమార్ (హాకీ) 16. అమిత్ రోహిదాస్ (హాకీ) 17. బిరేందర్ లక్రా (హాకీ) 18. సుమిత్ (హాకీ) 19.  నీలకంఠ శర్మ (హాకీ) 20. హార్థిక్ సింగ్ (హాకీ) 21. వివేక్ సాగర్ ప్రసాద్ (హాకీ) 22. గుర్జంత్ సింగ్ (హాకీ) 23. మన్దీప్ సింగ్ (హాకీ) 24. శంషర్ సింగ్ (హాకీ) 25. లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (హాకీ) 26. సిమ్రన్ జీత్ సింగ్ (హాకీ) 27. యోగేశ్ కథునియా (పారా అథ్లెట్స్) 28. వరుణ్ కుమార్ (హాకీ) 29. నిషద్ కుమార్ (పారా అథ్లెట్స్) 30. ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెట్స్) 31. సుహాస్ యతిరాజ్ (పారా బ్యాడ్మింటన్) 32. సింగరాజ్ అదన (పారా షూటింగ్) 33. భవనా పటేల్ (పారా టేబుల్ టెన్నిస్) 34. హర్విందర్ సింగ్ (పారా ఆర్చరీ) 35. శరద్ కుమార్ (పారా అథ్లెటిక్స్) 

ఈ అవార్డులను నవంబర్ 13న రాష్ట్రపతి భవన్ లో క్రీడాకారులకు అందజేయనున్నారు.  దర్బార్ హాల్ లో జరుగబోయే ఈ కార్యక్రమంలో విజేతలకు పథకాలు, నగదు పురస్కారం అందించనున్నారు.ఖేల్ రత్న, అర్జున అవార్డులతో పాటు ద్రోణాచార్య పురస్కారాలను కూడా ఈ సందర్భంగా అందజేయనున్నారు. 

click me!