ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత... రోహిత్ శర్మ కూడా సాధ్యం కానీ రికార్డును కొట్టి...

Published : May 18, 2022, 01:57 PM IST
ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత... రోహిత్ శర్మ కూడా సాధ్యం కానీ రికార్డును కొట్టి...

సారాంశం

టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ముష్పికర్ రహీం... ప్రస్తుత తరంలో రెండు ఫార్మాట్లలోనూ 5 వేలకు పైగా పరుగులు చేసిన...

ఐపీఎల్‌లో ఎన్నో సీజన్ల పాటు పేరు రిజిస్టర్ చేయించుకున్నా, వేలంలో షార్ట్ లిస్టు కాని ప్లేయర్లలో బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఒకడు. గత 14 సీజన్ల అనుభవాల కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకోలేదు ముష్ఫికర్...

క్రీజులో కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ, అరుస్తూ, మిరుగుండ్లు వేసుకుని చూస్తూ... అతిగా ప్రవర్తించే ముష్ఫికర్ రహీంని టీమిండియాలో తెగ ట్రోల్ చేశారు నెటిజన్లు. కారణంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు, పాకిస్తాన్ చేతుల్లో ఓడిన తర్వాత ‘ఈ రోజు నాకు హ్యాపీగా ఉంది. టీమిండియా ఓడిపోయింది...’ అంటూ పోస్టు చేశాడు ముష్ఫికర్. ఈ పోస్టు కారణంగా అతనిపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది, ఇప్పటికీ వస్తూనే ఉంది...

విమర్శలు ఎలా ఉన్నా, ముష్ఫికర్ రహీం ఓ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తరుపున టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు ముష్ఫికర్ రహీం... ప్రస్తుత క్రికెట్‌లో వన్డేల్లో, టెస్టుల్లో ఐదు వేలకు పైగా పరుగులు చేసిన ఆరో క్రికెటర్‌గా నిలిచాడు ముష్ఫికర్ రహీం...

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ మాత్రమే రెండు ఫార్మాట్లలో 5 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లుగా ఉన్నారు...

భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో 9200+ పైగా పరుగులు చేసి 10 వేల క్లబ్‌కి చేరువైనా, టెస్టుల్లో మాత్రం 3137 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అలాగే టెస్టుల్లో 8 వేలకు పైగా పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, వన్డేల్లో మాత్రం 4378 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

81 టెస్టుల్లో 149 ఇన్నింగ్స్‌ల్లో 36.66 యావరేజ్‌తో 5023 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీం, వన్డేల్లో 233 మ్యాచులు ఆడి 6697 పరుగులు చేశాడు. టీ20ల్లో 100 మ్యాచులు ఆడి 1495 పరుగులు చేశాడు. అయితే ఇప్పటిదాకా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేకపోయిన క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు ముష్ఫికర్...

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది బంగ్లాదేశ్ జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్ 199 పరుగులు చేసి అదరగొట్టడంతో లంక జట్టు 397 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

145 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 420 పరుగులు చేసిన బంగ్లాదేశ్, పర్యటక జట్టుపై 23 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ముష్ఫికర్ రహీం 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు...

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 218 బంతుల్లో 15 ఫోర్లతో 133 పరుగులు చేసి అవుట్ కాగా వికెట్ కీపర్ లిటన్ దాస్ 189 బంతుల్లో 10 ఫోర్లతో 88 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

టెస్టు మ్యాచ్ మరోక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో తొలి టెస్టు ఫలితం తేలడం కష్టమే. ఐదు సెషన్లలో మరో సెషన్లు జరగడం అసాధ్యం కావడంతో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు