రాహుల్ కి ఆ సత్తా ఉంది.. కేన్ విలియమ్సన్ ప్రశంసల వర్షం..!

By telugu news teamFirst Published May 18, 2022, 11:24 AM IST
Highlights

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 76 పరుగులు సాధించి త్రిపాఠి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ముంబై జట్టుపై సన్ రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ 2022లో యువ క్రికెటర్ రాహుల్ త్రిపాఠి సత్తా చాటుతున్నాడు. ఈ సన్ రైజర్స్  హైదరాబాద్ క్రికెటర్ అదరగొడుతున్నాడు. కాగా..  రాహుల్ త్రిపాఠి ఆట పై సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ చాలా స్పెషల్ క్రికెటర్ అంటూ అభివర్ణించాడు.

మంగళవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 76 పరుగులు సాధించి త్రిపాఠి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ముంబై జట్టుపై సన్ రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. తమ జట్టు విజయం సాధించడం పట్ల కెప్టెన్ కేన్ విలిమ్సన్ స్పందించాడు. 

రాహుల్ త్రిపాఠి ఇప్పుడు ఐపీఎల్ 2022లో మూడు హాఫ్ సెంచరీలతో  393 పరుగులు చేశాడు. కాగా.. ఏ ఆటనైనా మార్చే సత్తా త్రిపాఠికి ఉందని కేన్ విలియమ్సన్ అన్నాడు.

ఎలాంటి ఆట ఫలితాన్ని అయినా మార్చగల సామర్థ్యం త్రిపాఠీకి ఉందన్నాడు. ‘‘నిజానికి అతడు ప్రత్యేకమైన ప్లేయర్. అతడు బ్యాటింగ్ కు దిగితే ఆట తీరునే మార్చేస్తాడు. ఎన్నో సందర్భాల్లో దీన్ని చూశాను’’ అని విలియమ్సన్ తెలిపాడు. 

ఉమ్రాన్ మాలిక్ ను సైతం విలియమ్సన్ మెచ్చుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో అతడు రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2022లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఉమ్రాన్ ఎంతో వేగంగా బంతిని సంధించగలడని, తమ వైపు నుంచి అతను బలమైన ఆయుధమని పేర్కొన్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ప్రియమ్ గార్గ్‌కి తన మొదటి మ్యాచ్‌ను అందించింది. అతను వేగంగా 42 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు టోన్ సెట్ చేశాడు. గార్గ్ తన సత్తా ఉన్నందున సన్‌రైజర్స్ కోసం చాలా ఎక్కువ ఆడతాడని కేన్ విలియమ్సన్ చెప్పాడు.

"ప్రియమ్ గంభీరమైన ప్రతిభావంతులైన క్రికెటర్... అతను అవకాశాన్ని పొందడం గొప్పది. మనం ఇంకా చాలా చూడబోతున్న ఆటగాళ్లలో అతను ఒకడు, చాలా సామర్థ్యం ఉంది. చాలా ఎక్కువ నైపుణ్యం కూడా ఉంది," అని అతను చెప్పాడు.
 

click me!