రవిశాస్త్రికి రోహిత్ శర్మ కౌంటర్: మురళీ విజయ్ సంచలన వ్యాఖ్య

By telugu teamFirst Published Aug 31, 2019, 9:13 PM IST
Highlights

తాను ఏ జట్టుకు ఆడుతాననేది అనవసరమని, తాను ఏ జట్టు కోసం ఆడదినా ఆటపై ఉన్న అభిమానంతో మాత్మరే ఆడుతానని మురళీ విజయ్ అన్నాడు. ఉన్నత స్థాయి క్రికెట్ ఆడడమే తన లక్ష్యమని ఆయన అన్నాడు. 

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ సంచలన ప్రకటన చేశాడు. తాను దేశం కోసం మాత్రమే ఆడాలని భావించనని, ఫ్యాషన్ తో మాత్రమే ఆడుతానని ఆయన అన్నారు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఈ నేపథ్యంలో మురళీ విజయ్ ఆ ప్రకటన చేశాడని భావిస్తున్నారు. 

జట్టులో ఆటకన్నా ఎవరూ గొప్ప కాదని, అది కెప్టెన్ విరాట్ కోహ్లీ అయినా తానైనా... అందరం జట్టు కోసం ఆలోచించేవాళ్లమేనని రవిశాస్త్రి అన్నాడు. తాను కేవలం జట్టు కోసమే కాదు.. దేశం కోసం కూడా ఆడుతానని రోహిత్ శర్మ అన్నాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలకు కౌంటర్ గానే రోహిత్ ఆ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్న సమయంలో మురళీ విజయ్ ఆ విధంగా అన్నాడు. 

తాను ఏ జట్టుకు ఆడుతాననేది అనవసరమని, తాను ఏ జట్టు కోసం ఆడదినా ఆటపై ఉన్న అభిమానంతో మాత్మరే ఆడుతానని మురళీ విజయ్ అన్నాడు. ఉన్నత స్థాయి క్రికెట్ ఆడడమే తన లక్ష్యమని ఆయన అన్నాడు. ఇక్కడ జట్లు అనేవి తనకు ముఖ్యమ కాదని, ఏ తరహా క్రికెట్ ఆడాల్సి వచ్చినా తన వరకు న్యాయం చేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తానని అన్నాడు. 

దాదాపు 15 ఏళ్లుగా క్రికెట్ ను తాను ఇదే తరహాలో ఆస్వాదిస్తూ వస్తున్నానని మురళీ విజయ్ చెప్పాడు. తనకు వచ్చే అవకాశాలు ఎప్పుడు కూడా మరింత అనుభవాన్ని ఇచ్చాయని, అవి ముందుకు సాగడానికి పనికి వచ్చాయని ఆయన అన్నాడు.

నిరుడు డిసెంబర్ లో పెర్త్ లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచులో భారత్ తరఫున మురళీ విజయ్ చివరిసారి ఆడాడు. ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ ఆటగాడిగా స్థానం సంపాదించుకోలేకపోయాడు. వెస్టిండీస్ తో ప్రస్తుతం జరుగుతున్న రెండు టెస్టు సిరీస్ లో విజయ్ కు స్థానం దక్కలేదు. 

ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇప్పుడు జట్టులో కొనసాగుతున్నారు. విజయ్ కు స్థానం దక్కలేదు. దాంతోనే విజయ్ అటువంటి సీరియస్ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. జట్టులో ఉన్నప్పటికీ రోహిత్ శర్మకు తుది జట్టులో స్థానం కల్పించడం లేదు.

click me!