MI vs KKR: పోలార్డ్ అరుదైన రికార్డు... ముంబై ఇండియన్స్ తరపున...

Published : Sep 23, 2020, 07:20 PM IST
MI vs KKR: పోలార్డ్ అరుదైన రికార్డు... ముంబై ఇండియన్స్ తరపున...

సారాంశం

ముంబై ఇండియన్స్ జట్టుకి 50 మ్యాచులు ఆడిన మొదటి ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్, 100 మ్యాచులు ఆడిన మొదటి ప్లేయర్‌గా హర్భజన్ సింగ్ రికార్డు... 150 మ్యాచులు ఆడిన మొట్టమొదటి ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా కిరన్ పోలార్డ్...  

IPL 2020: ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్‌కి 150వ మ్యాచ్ ఆడుతున్న మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు కిరన్ పోలార్డ్. నాలుగు సార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ జట్టుకి 50 మ్యాచులు ఆడిన మొదటి ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్, 100 మ్యాచులు ఆడిన మొదటి ప్లేయర్‌గా హర్భజన్ సింగ్ రికార్డు క్రియేట్ చేశారు.

సచిన్ 78 ఐపీఎల్ మ్యాచుల తర్వాత రిటైర్మెంట్ తీసుకోగా... ముంబైకి 136 మ్యాచులు ఆడిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడు. దీంతో 150 మ్యాచులు ఆడిన మొట్టమొదటి ముంబై ప్లేయర్‌గా కిరన్ పోలార్డు రికార్డు నెలకొల్పాడు.

డక్కెన్ ఛార్జర్స్ నుంచి ముంబైకి వచ్చిన ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ... ముంబై తరుపున తన 145 మ్యాచ్ ఆడుతున్నాడు. అత్యధిక ఐపీఎల్ మ్యాచులు ఆడిన విదేశీ క్రికెటర్‌గా ఏబీ డివిల్లియర్స్ తర్వాతి స్థానంలో నిలిచాడు పోలార్డ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ఏబీడీ 155 ఐపీఎల్ మ్యాచులు ఆడగా, పోలార్డ్ 150 మ్యాచులు ఆడాడు. షేన్ వాట్సన్ 136, బ్రావో 134 మ్యాచులు ఆడారు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !