ఎంఐ న్యూయార్క్ టీమ్ కెప్టెన్‌గా పొలార్డ్.. ఇంటర్నేషనల్ స్టార్స్‌తో పటిష్టంగా ముంబై

Published : Jun 15, 2023, 01:30 PM IST
ఎంఐ న్యూయార్క్ టీమ్ కెప్టెన్‌గా పొలార్డ్.. ఇంటర్నేషనల్ స్టార్స్‌తో పటిష్టంగా ముంబై

సారాంశం

Major League Cricket: అగ్రరాజ్యం అమెరికా వేదికగా  వచ్చే నెల 13 నుంచి  మేజర్ లీగ్ క్రికెట్ మొదలుకానున్న నేపథ్యంలో  ఈ లీగ్ లో ఫ్రాంచైజీని దక్కించుకున్న ఎంఐ న్యూయార్క్ తమ అంతర్జాతీయ స్టార్లను  పరిచయం చేసింది. 

మరో నెల రోజుల్లో యూనైటైడ్ స్టేట్స్ వేదికగా  మొదలుకాబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)  టోర్నీకి గాను  ఈ లీగ్ లో ఫ్రాంచైజీని దక్కించుకున్న ఐపీఎల్ దిగ్గజ జట్టు ముంబై ఇండియన్స్  తమ జట్టులోని కీలక సభ్యులను ప్రకటించింది.  9 మంది అంతర్జాతీయ సూపర్ స్టార్లను అభిమానులకు పరిచయం చేసింది. ఈ లీగ్ లో ముంబై.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎంఐ న్యూయార్క్ గా ఉన్న ఈ టీమ్ కు  విండీస్ మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్ సారథ్యం వహించనున్నాడు. 

9 మందితో కూడిన  అంతర్జాతీయ  సూపర్ స్టార్స్ లిస్ట్ ను  ఎంఐ న్యూయార్క్ తాజాగా విడుదల చేసింది. ఈ టీమ్ లో  గతంలో  ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడిన ట్రెంట్ బౌల్ట్  తో పాటు దక్షిణాఫ్రికాలో ఎంఐ కేప్‌టౌన్  కు సారథిగా వ్యవహరించే రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. 

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడే  టిమ్, డేవిడ్, జేసన్ బెహ్రాన్‌డార్ఫ్  కూడా ఈ టీమ్ లో సభ్యులే. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియన్లే.. ఇక విండీస్ నుంచి పొలార్డ్ తో పాటు  నికోలస్ పూరన్ కూడా  ఉన్నాడు. దక్షిణాఫ్రికా పేస్ సంచలనం కగిసొ రబాడా, నమీబియా ఆటగాడు డేవిడ్ వీస్ లు న్యూయార్క్ కు ప్రాతినిథ్యం వహించనున్నారు.  దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ కూడా  న్యూయార్క్ తరఫునే ఆడనున్నాడు. పైన పేర్కొన్న వారిలో ఒక్క డేవిడ్ వీస్ మినహా మిగిలినవారంతా ఐపీఎల్, ఇంటర్నేషనల్ టీ20లీగ్, ఎస్ఎ20 లలో  ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారే కావడం గమనార్హం.  

కోచింగ్ స్టాఫ్.. 

సౌతాఫ్రికా మాజీ ఆటగాడు రాబిన్ పీటర్సన్  ఎంఐ న్యూయార్క్ కు హెడ్‌కోచ్ గా వ్యవహరించనున్నాడు. ముంబై ఇండియన్స్  కు సుదీర్ఘకాలం బౌలర్ గా సేవలందించి   2022 నుంచి రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ గా ఉన్న లసిత్ మలింగ.. న్యూయార్క్ కు బౌలింగ్ కోచ్ గా ఎంపికయ్యాడు.  బ్యాటింగ్ కోచ్ గా అరుణ్ కుమార్, ఫీల్డింగ్ కోచ్ గా జేమ్స్ పమ్మెంట్  బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

 

అమెరికాలో ఇదే మొదటి పూర్తిస్థాయి ప్రొఫెషనల్ టోర్నీ.  ఎంఎల్‌సీ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్  ప్రకారం.. జులై 13 నుంచి ఈ క్రేజీ లీగ్ మొదలుకానున్నది. 17 రోజుల పాటు అగ్రరాజ్యాన జరిగే ఈ లీగ్..  జులై 30న ముగుస్తున్నది. 

ఆరు జట్లు : 

- టెక్సాస్ సూపర్ కింగ్స్ (సీఎస్కే)
- లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (కేకేఆర్) 
- సియాటెల్ ఆర్కాస్ (ఢిల్లీక్యాపిటల్స్) 
- ఎంఐ న్యూయార్క్ (ముంబై ఇండియన్స్) 
- వాషింగ్టన్ ఫ్రీడమ్ 
- సాన్‌ఫ్రాన్సిస్కో  యూనికార్న్స్  

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?