త్వరగా ఫినిష్ చేయరు: ధోనీపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Oct 23, 2019, 5:36 PM IST
Highlights

ధోనీ భవితవ్యంపై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోనీ మనసులో ఏముందో తెలియదని గంగూలీ అన్నారు. తాను ఇప్పటి వరకు ధోనీతో మాట్లాడలేదని చెప్పారు.

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోనీ భవితవ్యంపై ఆయన చమత్కారంగా మాట్లాడారు. ఛాంపియన్స్ త్వరగా ఫినిష్ చేయరని ఆయన వ్యాఖ్యానించారు. బిసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గంగూలీ మీడియాతో మాట్లాడారు. 

భారత క్రికెట్ లో ఎంఎస్ ధోనీ భవితవ్యంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంగా గంగూలీ సహజంగానే ఆ విషయంపై స్పందించారు. భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ధోనీ తక్షణ భవిష్యత్తుపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఛాంపియన్లు త్వరగా ఫినిష్ చేయరని వ్యాఖ్యానించారు. 

Also Read: విరాట్ కోహ్లీతో రేపే గంగూలీ భేటీ: ఆ తర్వాత ఎంఎస్ ధోనీతో...

ధోనీ పని అయిపోయిందని ప్రతి ఒక్కరూ అంటున్న సమయంలో తిరిగి బలంగా ముందుకు వచ్చాడని, మరో నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడని ఆయన అన్నారు. తాను ఇప్పటి వరకు ధోనీతో మాట్లాడలేదని, ధోనీ మైండ్ లో ఏముందో తెలియదని, అయితే తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్లంతా ధోనీని గౌరవిస్తారని అన్నారు.

ధోనీ సాధించిన విజయాలను ప్రశంసించారు. ధోనీ విజయాలు దేశానికి గర్వకారణమయ్యాయని అన్నారు. భారత క్రికెట్ జట్టును నడిపించిట్లుగానే బిసీసీఐని నడిపిస్తానని చెప్పారు. విశ్వసనీయతపై, అవినీతి రాహిత్యంపై రాజీ పడే ప్రసక్తి లేదని అన్నారు. విరాట్ కోహ్లీని గంగూలీ ప్రశంసలతో ముంచెత్తారు.

Also Read: ఎన్నిక ఏకగ్రీవం: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సౌరవ్ గంగూలీ

click me!