మ్యాచ్‌కి ముందే ధోనీకి గుడ్‌న్యూస్... కరోనా నుంచి కోలుకున్న మాహీ తల్లిదండ్రులు..

Published : Apr 28, 2021, 06:49 PM IST
మ్యాచ్‌కి ముందే ధోనీకి గుడ్‌న్యూస్... కరోనా నుంచి కోలుకున్న మాహీ తల్లిదండ్రులు..

సారాంశం

వారం రోజుల కరోనా బారిన పడిన మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు... రాంఛీలోని ఆసుపత్రిలో చికిత్స... కరోనా నుంచి కోలుకుని, ఇంటికి చేరిన మాహీ పేరెంట్స్...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కి ముందే సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీకి గుడ్‌న్యూస్ వినిపించింది. కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడిన ఆయన తల్లిదండ్రులు, ఆ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఏప్రిల్ 21న మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవీ, పాన్‌సింగ్‌లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 

వారిని రాంఛీలోని ఆసుపత్రిలో ఐసోలేషన్ ఏర్పాటుచేశారు. తాజాగా వారికి నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికీ కరోనా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశార్చ్ అయారట ధోనీ తల్లిదండ్రులు. ప్రస్తుతం ధోనీ, ఐపీఎల్ కోసం అహ్మదాబాద్‌లో ఉన్నాడు.

అయితే తల్లిదండ్రులకు కరోనా సోకిన విషయం తెలిసినప్పటి నుంచి ఇక్కడి నుంచే అక్కడ వారికి ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేశాడు ధోనీ. ధోనీ భార్య సాక్షి సింగ్, అత్తామామల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !