చేజారిందనుకున్న మ్యాచ్ గెలిచిన ఆనందంలో కోహ్లీ.. డివిలియర్స్ కి హ్యాట్సాఫ్

By telugu news teamFirst Published Apr 28, 2021, 9:52 AM IST
Highlights

చేజారిందనుకున్న మ్యాచ్ విజయం సాధించడం పై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు.  మ్యాచ్ పోయిందనకున్న సమయంలో సిరాజ్ ఆఖరి ఓవర్ కారణంగా తాము విజయం సాధించామని కోహ్లీ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్ లో ఆర్సీబీ సత్తా చాటుతోంది. తన విజయాల పరంపర కొనసాగిస్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ...  ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. కేవలం ఒక్క పరుగుతో ఢిల్లీపై బెంగళూరు జట్టు విజయం సాధించింది.

చేజారిందనుకున్న మ్యాచ్ విజయం సాధించడం పై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు.  మ్యాచ్ పోయిందనకున్న సమయంలో సిరాజ్ ఆఖరి ఓవర్ కారణంగా తాము విజయం సాధించామని కోహ్లీ పేర్కొన్నాడు.

మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో కోహ్లి మాట్లాడుతూ.. ‘ మేము బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయాం. కానీ ఏబీ డివిలియర్స్‌ ఆఖరి కొన్ని ఓవర్లలో బ్యాట్‌ ఝుళిపించడంతో మళ్లీ రేసులోకి వచ్చాం. ఇక మేము బౌలింగ్‌ చేసేటప్పుడు హెట్‌మెయిర్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో మ్యాచ్‌ కోల్పోతున్నాం అనిపించింది. హెట్‌మెయిర్‌ ఇన్నింగ్స్‌ తప్పితే మిగతా అంతా మేము కంట్రోల్‌గానే బౌలింగ్‌ చేశాం. మేము పొడి బంతితో బౌలింగ్‌ చేశాం. డ్యూ లేదు. బంతి పొడిగా ఉండటానికి ఇసుక ఉండటమే కారణం. ఇందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మ్యాక్స్‌వెల్‌ ఇంకా బౌలింగ్‌ చేయడం లేదు. మ్యాక్సీ మాకు 7వ ఆప్షన్‌. మాకు చాలా బౌలింగ్‌ వనరులు ఉండటంతో మ్యాక్సీకి బౌలింగ్‌ ఇవ్వడం లేదు. మా బ్యాటింగ్‌ లైనప్‌ కూడా చివరి వరకూ బలంగానే ఉంది. ఏబీ సుమారు ఐదు నెలల నుంచి కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడటం లేదు. కానీ అతని బ్యాటింగ్‌ చూస్తుంటే అంత కాలం నుంచి క్రికెట్‌ ఆడుకుండా ఉన్నట్టు లేదు. ఏబీకి హ్యాట్పాఫ్‌. పదే పదే బ్యాటింగ్‌లో మెరుస్తూ జట్టుకు ఒక ఆస్తిలా మారిపోయాడు’ అని తెలిపాడు. 

click me!