రెండో వన్డేపై ఆసక్తి, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి.. టీమిండియాపై మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్

By telugu teamFirst Published Jan 17, 2020, 1:42 PM IST
Highlights

కంగారులూ కూడా..,నేటి మ్యాచ్ లోనూ విజయం సాధించాలని ఆసక్తిగా చూస్తుంటే... ఈ మ్యాచ్ లో నైనా కంగారులను ఓడించాలని కోహ్లీసేన ఆశగా చూస్తోంది. 

టీమిండియా నేడు ఆస్ట్రేలియాతో రెండో వన్డే కోసం తలపడుతోంది. కాగా... ఈ రెండో వన్డేలో భారత క్రికెటర్లు ఎలా ఆడతారనేదానిపై తనకు అమితాసక్తిగా ఉందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేర్కొన్నారు. 

ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. పది వికెట్ల పరాజయానికి పాలైంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మాత్రం చిత్తులేపారు. వన్డే ఇంటర్నేషనల్ లో ఆస్ట్రేలియా సంచలన రికార్డు సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. భారత్ ని చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో రెండో వన్డే ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ కలిగింది.

కంగారులూ కూడా..,నేటి మ్యాచ్ లోనూ విజయం సాధించాలని ఆసక్తిగా చూస్తుంటే... ఈ మ్యాచ్ లో నైనా కంగారులను ఓడించాలని కోహ్లీసేన ఆశగా చూస్తోంది. 

Also Read రాజ్ కోట్ వన్డే : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.

ఈ  నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్విట్టర్ వేదికగా రెండో వన్డేపై స్పందించారు. ‘‘ రెండో వన్డేలో భారత్ ఎలా స్పందిస్తుందో  చూడాలని నాకు ఆసక్తి గా ఉంది. వాళ్లు నిజాయితీగా ఏంటే.. వారు గతంలో సాధించిన రెండు వరల్డ్ కప్ లను అంగీకరిస్తారు. నాకు మిడిల్ ఆర్డర్ గురించి తెలీదు. కానీ... మూడేళ్ల తర్వాత మళ్లీ వచ్చే వరల్డ్ కప్ లో మాత్రం టీమిండియానే విజేతగా నిలిచి సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచుల్లో ఎవరైతే అతిథ్యం ఇస్తున్నారో ఆ జట్టే విజేతగా నిలుస్తూ వస్తోంది. 2023లో జరిగే ప్రపంచకప్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో.. ఆతిథ్య జట్టు విజయం సాధించే సంప్రదాన్ని భారత్ కొనసాగించాలని తాను కోరుకుంటున్నట్లు మైకేల్ వాన్ పేర్కొన్నారు.
 

click me!