అలా చేసివుంటే ఫలితం వేరేలా వుండేది..కానీ: కెకెఆర్ చేతిలో ఓటమిపై ధోని

By Arun Kumar PFirst Published Oct 8, 2020, 10:08 AM IST
Highlights

కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో సీఎస్కే ఓటమి అనంతరం మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13 టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ధోని సేన చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటికే 6మ్యాచులాడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా నాలుగుమ్యాచుల్లో ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా ధోని గతంలో మాదిరిగా దూకుడుగా ఆడటంలో విఫలమవుతుండటం ఈ ఓటములకు ప్రదాన కారణమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ధోనీనే ఒప్పుకున్నారు. 

కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో సీఎస్కే ఓటమి అనంతరం మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తాజా మ్యాచ్ లో బౌలర్లు చాలా బాగా ఆడారని... తామే(బ్యాట్స్ మెన్స్) వారి శ్రమను వృధా చేశామన్నాడు. కెకెఆర్ చేతిలో ఓటమికి బ్యాట్స్ మెన్స్ వైఫల్యమే ప్రధాన కారణమని ధోని అన్నారు. 

మొదట తమ బౌలర్లు చాలాబాగా బౌలింగ్ చేశారు. ప్రతిఒక్కరి ప్రదర్శన అద్భుతంగా వుంది. కానీ బ్యాటింగ్ విషయంలోనే పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా లక్ష్యచేధన దిశగా సాగుతున్న సమయంలో మిడిల్ ఓవర్లలో ఎక్కువగా పరుగులు రాబట్టలేక పోయామని... దీంతో చివర్లో బ్యాట్స్ మెన్స్ పై ఒత్తిడి పెరిగిందన్నారు. దీంతో బౌండరీల కోసం ప్రయత్నించి వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చిందన్నారు. తాము వికెట్లు కోల్పోకుండా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఫలితం వేరేలా వుండేదని ధోని పేర్కొన్నారు.

read more  యువ త్రిపాఠి తీన్మార్: చెన్నై పై కోల్‌కత అపూర్వ విజయం

బుధవారం చెన్నై వర్సెస్  కోల్‌కత మ్యాచులో దినేష్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ 10 పరుగులతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ పరుగుల సునామీని కట్టడి చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది  కోల్‌కతా. 

 కోల్‌కతా తరుఫున ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ వేరే లెవెల్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  కోల్‌కత 167 పరుగులకు ఆల్ అవుట్ అయింది.  కోల్‌కత టీం లయ దొరకబుచ్చుకునేందుకు బ్యాటింగ్ ఆర్డర్లో అనేక మార్పులను చేసింది. ఈ మార్పుల్లో భాగంగా రాహుల్ త్రిపాఠి శుభమన్ గిల్ తో కలిసి ఓపెనర్ గా వచ్చాడు. వచ్చింది మొదలు ఇన్నింగ్స్ ఆద్యంతం చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎవ్వరిని వదలకుండా, కనికరం చూపకుండా స్టేడియం నలువైపులా భారీ షాట్లనాడాడు. 

సెంచరీ పూర్తి చేసుకుంటాడు అనుకుంటున్నా తరుణంలో 81 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 8 ఫోరులు, మూడు సిక్సర్ల సహాయంతో కేవలం 51 బంతుల్లోనే 81 పరుగులు చేసాడు. అవతలి పక్క టపటపా వికెట్లు పడుతున్నప్పటికీ.... రాహుల్ త్రిపాఠి మాత్రం ఎక్కడా కూడా తన ఏకాగ్రతను కోల్పోకుండా ఆడాడు. కేకేఆర్ చేసిన మార్పుల్లో కేవలం ఓపెనర్ గా రాహుల్ త్రిపాఠిని దింపడం మాత్రమే కలిసి వచ్చింది. 

ఇక ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన చెన్నై బ్యాట్స్ మెన్ బాగానే సపోర్ట్ అందజేసినప్పటికీ... అందిన స్టార్ట్ ని, మూమెంటుమ్ చెన్నై ప్లేయర్స్ ముందుకు తీసుకెళ్లలేకపోయారు. చెన్నై ప్లేయర్స్ లో వాట్సన్ అర్థ సెంచరీ సాధించాడు.  కోల్‌కత బౌలర్లలో పాట్ కమిన్స్ మినహా మిగితావారంతా తలా ఒక వికెట్ సాధించారు. 


 

click me!