ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నైఫై కోల్‌కత అద్భుత విజయం

By team teluguFirst Published Oct 7, 2020, 11:40 PM IST
Highlights

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ పరుగుల సునామీని కట్టడి చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది  కోల్‌కత. 

ఇప్పుడే ముగిసిన చెన్నై వర్సెస్  కోల్‌కత మ్యాచులో దినేష్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ 10 పరుగులతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ పరుగుల సునామీని కట్టడి చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది  కోల్‌కత. 

ఇక నేటి మ్యాచులో  కోల్‌కత తరుఫున ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ వేరే లెవెల్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  కోల్‌కత 167 పరుగులకు ఆల్ అవుట్ అయింది.  కోల్‌కత టీం లయ దొరకబుచ్చుకునేందుకు బ్యాటింగ్ ఆర్డర్లో అనేక మార్పులను చేసింది. 

ఈ మార్పుల్లో భాగంగా రాహుల్ త్రిపాఠి శుభమన్ గిల్ తో కలిసి ఓపెనర్ గా వచ్చాడు. వచ్చింది మొదలు ఇన్నింగ్స్ ఆద్యంతం చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎవ్వరిని వదలకుండా, కనికరం చూపకుండా స్టేడియం నలువైపులా భారీ షాట్లనాడాడు. 

సెంచరీ పూర్తి చేసుకుంటాడు అనుకుంటున్నా తరుణంలో 81 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 8 ఫోరులు, మూడు సిక్సర్ల సహాయంతో కేవలం 51 బంతుల్లోనే 81 పరుగులు చేసాడు.

అవతలి పక్క టపటపా వికెట్లు పడుతున్నప్పటికీ.... రాహుల్ త్రిపాఠి మాత్రం ఎక్కడా కూడా తన ఏకాగ్రతను కోల్పోకుండా ఆడాడు. కేకేఆర్ చేసిన మార్పుల్లో కేవలం ఓపెనర్ గా రాహుల్ త్రిపాఠిని దింపడం మాత్రమే కలిసి వచ్చింది. 

ఇక ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన చెన్నై బ్యాట్స్ మెన్ బాగానే సపోర్ట్ అందజేసినప్పటికీ... అందిన స్టార్ట్ ని, మూమెంటుమ్ చెన్నై ప్లేయర్స్ ముందుకు తీసుకెళ్లలేకపోయారు. చెన్నై ప్లేయర్స్ లో వాట్సన్ అర్థ సెంచరీ సాధించాడు.  కోల్‌కత బౌలర్లలో పాట్ కమిన్స్ మినిహా మిగితావారంతా తలా ఒక వికెట్ సాధించారు. 

click me!