
ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, మరో ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వెయ్యి వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకాషిర్ తరుపున ఆడుతున్న అండర్సన్, హీనో కున్ వికెట్ తీసి ఈ రికార్డు పూర్తిచేసుకున్నాడు.
10 ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తీసిన అండర్సన్... ఈ ఘనత సాధించిన 14వ బౌలర్‌గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1000 వికెట్లు తీసిన ఐదో పేసర్ అండర్సన్. ఇంతకుముందు 2005లో ఆండీ క్యాడిక్, 2004లో మార్టిన్ బిక్‌నెల్, 2002లో డివాన్ మాల్కోమ్, 2001లో వసీం అక్రమ్ ఈ ఘనత సాధించారు...
162 టెస్టు మ్యాచులు ఆడిన 617 వికెట్లు తీసిన అండర్సన్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అండర్సన్ కంటే ముందున్న ముగ్గురూ స్పిన్నర్లే కావడం విశేషం.