మృత్యువుతో పోరాడి ఓడిన ప్యాట్ కమ్మిన్స్ తల్లి... నేడు నల్లబ్యాడ్జీలతో ఆస్ట్రేలియా ప్లేయర్ల నివాళి...

Published : Mar 10, 2023, 09:25 AM ISTUpdated : Mar 10, 2023, 09:41 AM IST
మృత్యువుతో పోరాడి ఓడిన ప్యాట్ కమ్మిన్స్ తల్లి... నేడు నల్లబ్యాడ్జీలతో ఆస్ట్రేలియా ప్లేయర్ల నివాళి...

సారాంశం

15 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్యాట్ కమ్మిన్స్ తల్లి మరియా కమ్మిన్స్... మృత్యువుతో పోరాడి ఓడిన మరియా! ఆమెకి నివాళిగా నల్లబ్యాడ్జీలతో బరిలో దిగుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు.. 

కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తల్లి మరియా కమ్మిన్స్ తుది శ్వాస విడిచారు. రెండో టెస్టు ముగిసిన వెంటనే తల్లికి తోడుగా ఉండేందుకు సిడ్నీకి వెళ్లిపోయాడు ప్యాట్ కమ్మిన్స్. ఆమె ఆరోగ్యం కోలుకుంటే మూడో టెస్టు ఆరంభానికి ముందే ఇండియాకి తిరిగి రావాలని అనుకున్నాడు. అయితే మరియా ఆరోగ్యం రోజురోజుకీ క్షిణించడంతో అది వీలు కాలేదు...

శుక్రవారం తెల్లవారుజామున మరియా కమ్మిన్స్ మరణించినట్టు వైద్యులు తెలియచేశాడు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తల్లి మరియాని నివాళిగా రెండో రోజు నల్ల బ్యాడ్జీలతో బరిలో దిగబోతున్నారు... 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. మూడో రోజు సాయంత్రమే తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో హుటాహుటీన ఆస్ట్రేలియాకి వెళ్లాడు ప్యాట్ కమ్మిన్స్. ఆమె ఆరోగ్యం కోలుకోకపోవడంతో తన దగ్గరే ఉండి చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ కారణంగానే ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టుకి, ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టుకి దూరమయ్యాడు ప్యాట్ కమ్మిన్స్. ఈ రెండు టెస్టులకు స్టీవ్ స్మిత్, తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు...

ప్యాట్ కమ్మిన్స్‌కి బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపింది. ‘భారత క్రికెట్ తరుపున ప్యాట్ కమ్మిన్స్ తల్లికి నివాళి అర్పిస్తున్నాం. ఆయనకి, ఆయన కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం...’ అంటూ ట్వీట్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు...

ప్యాట్ కమ్మిన్స్ తల్లి అంత్యక్రియల్లో పాల్గొని, ఇండియాకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. నాలుగో టెస్టు ముగిసిన తర్వాత మార్చి 17 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత చాలామంది ఆస్ట్రేలియా ప్లేయర్లు నేరుగా ఐపీఎల్ 2023 సీజన్‌లో పాల్గొంటారు. గత సీజన్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన ప్యాట్ కమ్మిన్స్, వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు.. 

 

 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?