రంజాన్ పండగ రోజు.. సిరాజ్ ఎమోషనల్ ట్వీట్..!

Published : May 15, 2021, 08:22 AM IST
రంజాన్ పండగ రోజు.. సిరాజ్ ఎమోషనల్ ట్వీట్..!

సారాంశం

 సిరాజ్ గతేడాది తన తండ్రిని కోల్పోయాడు. ఆ సమయంలో సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. కరోనా మహమ్మారి నిబంధనల నేపథ్యంలో.. సిరాజ్ కి కనీసం తండ్రి చివరి చూపు కూడా దక్కలేదు.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. తన కుటుంబసభ్యులతో శుక్రవారం రంజాన్ పండగను జరుపుకున్నారు. తన ఫ్యామిలీ ఫోటోని కూడా ఇన్ స్టాగ్రామ్ లో సిరాజ్ షేర్ చేశాడు. అయితే.. ఆ ఫోటోని షేర్ చేసే సమయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ విషయం ఆ ఫోటో కింద పెట్టిన ఆయన క్యాప్షన్ చూస్తేనే అర్థమౌతుంది.

‘‘ మన తల్లిదండ్రులు ఎప్పుడూ మనతోనే ఉంటే.. ప్రతిరోజూ ఈద్( రంజాన్) లాగే ఉంటుంది. అదే వాళ్లు మన దగ్గరలేకపోతే.. ఆ పండగ రోజు కూడా సంతోషం ఉండదు. మిస్ యూ నాన్న’’ అంటూ సిరాజ్ పోస్టు పెట్టాడు. 

 

కాగా.. సిరాజ్ గతేడాది తన తండ్రిని కోల్పోయాడు. ఆ సమయంలో సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. కరోనా మహమ్మారి నిబంధనల నేపథ్యంలో.. సిరాజ్ కి కనీసం తండ్రి చివరి చూపు కూడా దక్కలేదు. ఆ సమయంలోనూ సిరాజ్ మ్యాచ్ మధ్యలో కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. కాగా.. ఇప్పుడు రంజాన్ పండగ రోజున తన పక్కన తండ్రి లేకపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు ద్వారా తెలియజేశాడు. తాను షేర్ చేసిన ఫోటోలో సిరాజ్ తల్లి ఉన్నారు.

ఇదిలా ఉండగా.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు క్రికెటర్లు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండుల్కర్ లాంటి క్రికెటర్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !