రూ.11 కోట్ల 39 లక్షల 11 వేల 820... కరోనా బాధితుల కోసం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సేకరించిన విరాళాలు...

Published : May 14, 2021, 11:15 AM IST
రూ.11 కోట్ల 39 లక్షల 11 వేల 820... కరోనా బాధితుల కోసం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సేకరించిన విరాళాలు...

సారాంశం

మే 7న కరోనా బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... అభిమానుల నుంచి విశేష స్పందన... వారం రోజుల్లో రూ.11 కోట్లకు పైగా విరాళాలు...

దేశంలో పెరిగిపోతున్న కరోనా సెకండ్ వేవ్ బాధితుల సహాయార్థం భారత సారథి విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మల కలిసి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘కెట్టో’ సంస్థతో కలిసి మొదలెట్టిన ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి అభిమానుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది.

మొదటి రోజే రూ.3.6 కోట్ల విరాళాలు రాగా, ఆరు రోజుల్లో ఆ సంఖ్య 11 కోట్ల 39 లక్షల 11 వేల 820 రూపాయలకు చేరింది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘మీ అభిమానానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. మేం అనుకున్న టార్గెట్‌కి రెట్టింపు మొత్తం వచ్చింది.

విరాళం అందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మనం అందరం కలిసి కరోనా నుంచి దేశాన్ని కాపాడుదాం’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ... కరోనా బాధితుల సహాయార్థం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రూ.2 కోట్ల విరాళం అందించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !