ఆ క్రికెటర్ అంటే తనకు పిచ్చంటున్న షాహిద్ భార్య

Published : Feb 23, 2021, 02:35 PM IST
ఆ క్రికెటర్ అంటే తనకు పిచ్చంటున్న షాహిద్ భార్య

సారాంశం

ఇద్దరు పిల్లలకు తల్లైనా.. ఆమెలో అందం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. కాగా.. మీరా రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది.


బాలీవుడ్ అర్జున్ రెడ్డి.. షాహిద్ కపూర్ అందరికీ పరిచయమే. ఆయన భార్య మీరా రాజ్ పుత్ కూడా చాలా మంది సినీ ప్రముఖులకు సుపరిచితమే. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లైనా.. ఆమెలో అందం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. కాగా.. మీరా రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆమె ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్’‌ సెస్షన్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు మీరా తనదైన శైలి సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో మీ క్రష్‌ ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ‘నాకు దక్షిణాఫ్రియా క్రికెటర్‌ ఏబి డివిలియర్స్‌ అంటే క్రష్‌, ఐ లవ్‌ హిమ్’ ‌ అంటూ మీరా సమాధానం ఇచ్చారు.

క్షణం ఆలోచించకుండా ఓపెన్‌గా ఆమె చెప్పిన ఈ సమాధానికి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఇక దీనికి షాహిద్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. అదేవిధంగా తన ఇష్టమైన నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ఏంటని అడిగిన ప్రశ్నకు.. ప్రముఖ కామెడీ షో ‘షిట్స్ క్రీక్’ అంటే ఇష్టమని ఆమె చెప్పారు. కాగా షాహిద్‌-మీరాలు 2015లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి కూతురు మిష, కొడుకు జైన్‌లు ఉన్నారు. షాహిద్‌ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు రీమేక్‌ ‘జెర్సీ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?