MI vs SRH: భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్... షార్జాలో ‘సిక్సర్ల’ వర్షం...

Published : Oct 04, 2020, 05:15 PM ISTUpdated : Oct 04, 2020, 05:18 PM IST
MI vs SRH: భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్... షార్జాలో ‘సిక్సర్ల’ వర్షం...

సారాంశం

67 పరుగులు చేసిన డి కాక్... ఇషాన్ కిషన్, హార్ధిక్, కృనాల్ పాండ్యా, పోలార్డ్ మెరుపులు... 

IPL 2020లో మరోసారి భారీ స్కోరు నమోదైంది. షార్జా క్రికెట్ స్టేడియంలో మరో మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సిక్స్ కొట్టి అవుటైనా... సూర్యకుమార్ యాదవ్ 27, ఇషాన్ కిషన్ 31 పరుగులు చేశారు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్... భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

ఫీల్డింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన తప్పులు ముంబై ఇండియన్స్‌కి కలిసొచ్చాయి. కిరన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్యా ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేయగలిగింది. వరుస విరామాల్లో వికెట్లు తీసినా పరుగులను నియంత్రించడంలో సన్‌రైజర్స్ బౌలర్లు విఫలమయ్యారు.19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా ఆఖరి ఓవర్‌లో అవుట్ కాగా...   పోలార్డ్ 13 బంతుల్లో 3 సిక్సర్లతో 25 పరుగులు చేయగా, కృనాల్ పాండ్యా 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

ఈజీ అన్నావ్‌గా..! ఇప్పుడేంటి మరి.. మంజ్రేకర్‌కు కోహ్లీ సెటైర్..
బంగ్లాదేశ్ పోతేనేం.. ఐసీసీ పక్కా స్కెచ్‌తో టీ20 ప్రపంచకప్‌లోకి పసికూన జట్టు.!