ధోనీ, రికీ పాంటింగ్‌లను వెనక్కి నెట్టిన మెగ్‌ లానింగ్.. మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెట్ కెప్టెన్‌గా...

By Chinthakindhi RamuFirst Published Feb 27, 2023, 11:16 AM IST
Highlights

ఐదో ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్‌ని ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్... రికీ పాంటింగ్, మహేంద్ర సింగ్ ధోనీలను వెనక్కినెట్టిన మెగ్ లానింగ్.. 

క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లు అంటే ముందుగా గుర్తుకువచ్చేది రికీ పాంటింగ్, మహేంద్ర సింగ్ ధోనీయే... భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, తన కెప్టెన్సీ కెరీర్‌లో 3 ఐసీసీ టైటిల్స్ గెలిస్తే, రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాకి 4 ఐసీసీ టైటిల్స్ సాధించాడు. అయితే ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టుతూ క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచింది ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్...

కెప్టెన్‌గా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్, ఐదో ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్‌ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌గా 2022 వన్డే వరల్డ్ కప్ గెలిచిన మెగ్ లానింగ్, 2014, 2018, 2020, 2023 టీ20 వరల్డ్ కప్ టైటిల్స్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు ప్లేయర్‌గా 2012 టీ20 వరల్డ్ కప్, 2013 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్స్‌లో సభ్యురాలిగా ఉన్న మెగ్ లానింగ్, 2022 కామన్వెల్స్ గేమ్స్‌లోనూ కెప్టెన్‌గా స్వర్ణం సాధించింది..

Latest Videos

మెగ్ లానింగ్ కెప్టెన్సీలో 78 వన్డేలు ఆడిన ఆస్ట్రేలియా 8 మ్యాచుల్లో మాత్రమే ఓడింది. 100 టీ20 మ్యాచుల్లో 76 విజయాలు అందుకున్న మెగ్ లానింగ్, 18 ఓటములు చవిచూసింది. మిగిలిన 6 మ్యాచులు ఫలితం తేలకుండానే రద్దయ్యాయి. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్, పురుషుల క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగించగా, ఇప్పుడు మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మహిళా జట్టు.. అంతకుమించిన డామినేషన్ కనబరుస్తోంది.. 

ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఓడిపోవడం ఖాయమనే భయం, మిగిలిన జట్లలో క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ సాధించింది మెగ్ లానింగ్. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్‌కి ఓవరాల్‌గా ఇది 13వ వరల్డ్ కప్ టైటిల్. ఆస్ట్రేలియా పురుషుల జట్టు 6 సార్లు ఐసీసీ వరల్డ్ కప్ గెలిస్తే, దానికి డబుల్ టైటిల్స్‌ గెలిచేశారు ఆస్ట్రేలియా మహిళలు.  

ప్లేయర్‌లా ఆస్ట్రేలియా ఎలీసా పెర్రీకి ఇది 9వ వరల్డ్ కప్ టైటిల్...  2013 వన్డే వరల్డ్ కప్, 2022 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్స్‌లో సభ్యురాలిగా ఉన్న ఎలీసా పెర్రీ, 2010, 2012, 2014, 2018, 2020, 2023 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో సభ్యురాలిగా ఉంది..

Read also: ముంబై ఇండియన్స్‌కి షాక్... ఐపీఎల్‌కి దూరంగా జస్ప్రిత్ బుమ్రా! రోహిత్ వదులుతాడా?...

ఫైనల్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ‘ప్లేయర్ ఆఫ్ ది ఐసీసీ ఫైనల్స్‌’గా నిలిచింది ఆసీస్ సీనియర్ ప్లేయర్ బెత్ మూనీ. 2023 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 53 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన బెత్ మూనీ, 2022 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌లో 61 పరుగులు చేసింది. 2020 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో 62 పరుగులు చేసిన బెత్ మూవీ, 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.. 

click me!