
Andre Russell appreciates Ishant Sharma : ఐపీఎల్ 2024 16వ మ్యాచ్ లో కోల్ కతా నైల్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టి ఏకంగా 106 పరుగులతో కోల్ కతా ఢిల్లీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ తరఫున సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ ధనాధన్ ఇన్నింగ్స్ దుమ్మురేపారు. ఇన్నింగ్స్ చివరలో రింకు సింగ్ ఫోర్లు సిక్సర్లతో అదరగొట్టాడు. దీంతో కేకేఆర్ 273 పరుగుల భారీ టార్గెట్ ను ఢిల్లీ ముందు ఉంచింది. బౌలింగ్ లోనూ అదరగొట్టి 166 పరుగులకు ఢిల్లీని ఆలౌట్ చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అయితే, ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్, రఘువంశీ తర్వాత సూపర్ ఇన్నింగ్స్ తో ఆండ్రీ రస్సెల్ దుమ్మురేపాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇదేక్కడి ఆట సామి అనేలా ఉన్నంత సేపు బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు ఆండ్రీ రస్సెల్. ఢిల్లీతో జరిగిన ఐపీఎల్ 2024 16వ మ్యాచ్ లో కూడా కేకేఆర్ స్టార్ రస్సెల్ ఉచకోత ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ హడలెత్తించాడు. ఇలాగే రస్సెల్ ఉంటే స్కోర్ బోర్డు టీమ్ గా అత్యధిక స్కోర్ గత రికార్డులు కనుమరుగు కావడం ఖాయమనే అందరూ అనుకుంటున్న తరుణంలో ఇషాంత్ శర్మ వచ్చాడు. రస్సెల్ తన ఓవర్ తొలి బంతికే కిందపడేసి పెవిలియన్ కు పంపాడు.
క్రాకింగ్ షాట్స్.. ఢిల్లీ బౌలింగ్ ను చీల్చిచెండాడిన సునీల్ నరైన్.. !
ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ ప్రారంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో ఇషాంత్ కు చెమటలు పట్టించారు కేకేఆర్ బ్యాటర్లు. అయితే, మళ్లీ తన పదునైన బౌలింగ్ తో చివరలో అదరగొట్టాడు. రస్సెల్ సూపర్ ఫామ్ తో ఢిల్లీ బౌలింగ్ చిత్తు చేస్తున్న సమయంలో ఇషాత్ శర్మ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. అప్పటికే పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ మారుపేరుగా నిలిచిన ఆండ్రీ రస్సెల్ 19 బంతుల్లో 41 పరుగులు ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే, ఆఖరి ఓవర్‌లో ఇషాంత్ శర్మ వేసిన మెస్మరైజింగ్ డెడ్లీ యార్కర్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు రస్సెల్ కిందపడేశాడు. ఇషాంత్ వేసిన ఈ బంతిని ఎలా ఆడాలో తెలియక రస్సెల్ నెలపై పడేలా చేసింది.. వికెట్లు ఎగిరిపడ్డాయి.
అయితే, తనను ఔట్ చేసి కిందపడేసినా.. ఆ అద్భుతమైన డెలివరీ వేసిన ఇషాంత్ బౌలింగ్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రస్సెల్. ఔట్ అయినప్పటికీ.. క్రీజు వదిలే సమయంలో ఇంషాంత్ బౌలింగ్ కు మెచ్చుకున్నాడు. చప్పట్లు కొడుతూ క్రీడాస్పూర్తిని చాటాడు. దీంతో రస్సెల్ ఔట్ అయిన వీడియో.. అతని స్పందనలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి. నిజంగానే నువ్వు గ్రేట్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇలా క్లీన్ బౌల్డ్ తో ఔట్ అయ్యాక కూడా నువ్వు బౌలర్ ను మెచ్చుకుంటున్నావ్ చూడూ నిజంగా నువ్ గ్రేట్ అన్న అంటూ మీమ్స్ తో క్రికెట్ లవర్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు.
రింకూ సింగ్ తో పెట్టుకుంటే అంతే మరి.. !