న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా: 30 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన మయాంక్

By telugu teamFirst Published Feb 21, 2020, 11:20 AM IST
Highlights

కివీస్ గడ్డపై న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. 30 ఏళ్ల క్రితంనాటి మనోజ్ ప్రభాకర్ రికార్డును బద్దలు కొట్టాడు.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో శుక్రవారం మయాంక్ అగర్వాల్ రికార్డు సృష్టించాడు.  30 ఏళ్ల నాటి రికార్డును అతను బద్దలు కొట్టాడు. తొలి సెషన్ మొత్తం క్రీజులో ఉండడం ద్వారా అతను ఆ ఘనత సాధించాడు. 

1990లో నేపియర్ వేదికగా న్యూజిలాండ్ పై జరిగన రెండో టెస్టు మ్యాచులో ఓపెనర్ గా వచ్చిన మనోజ్ ప్రభాకర్ తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేశాడు. మనోజ్ ప్రభాకర్ తర్వాత మొత్తం తొలి సెషన్ బ్యాటింగ్ చేసిన ఇండియన్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ మాత్రమే. వీరిద్దరు తప్పిస్తే న్యూజిలాండ్ గడ్డపై తొలి సెషన్ మొత్తం క్రీజులో ఉన్న మరో భారత ఓపెనర్ లేడు.

Also Read: విరాట్ కోహ్లీ మరీ చెత్త: 19 ఇన్నింగ్సుల్లో జీరో సెంచరీలు

మయాంక్ అగర్వాల్ 84 బంతులు ఆడి 34 పరుగులు చేశాడు. మనోజ్ ప్రభాకర్ 1990లో న్యూజిలాండ్ పై జరిగిన రెండో టెస్టు మ్యాచులో తొలి సెషన్ మొత్తం క్రీజులో ఉండి చరిత్ర సృష్టించాడు. అతను 268 బంతులు ఆడి 95 పరుగులు చేసింది. భారత్ ఈ ఇన్నింగ్సును 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

భారత్ న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో ఘోరంగా విఫలమైంది. ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. టాపార్డర్ కుప్పకూలింది.  విరాట్ కోహ్లీ కూడా విఫలమయ్యాడు. ప్రస్తుతం అజింక్యా రహానే, రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు.

Also Read: కివీస్ బౌలర్ జెమీసన్ దెబ్బ: తొలి రోజు భారత్ స్కోరు 122/5

click me!