బంగ్లాను ఆటాడుకున్న మతీష పతిరన! నజ్ముల్ హుస్సేన్ ఒంటరి పోరాటం చేసినా... శ్రీలంక ముందు..

Published : Aug 31, 2023, 06:45 PM ISTUpdated : Aug 31, 2023, 06:59 PM IST
బంగ్లాను ఆటాడుకున్న మతీష పతిరన! నజ్ముల్ హుస్సేన్ ఒంటరి పోరాటం చేసినా...  శ్రీలంక ముందు..

సారాంశం

Asia Cup 2023: 42.4 ఓవర్లలో 164 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్... 4 వికెట్లు తీసిన శ్రీలంక యంగ్ బౌలర్ మతీష పతిరన...

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక యంగ్ బౌలర్ మతీష పతిరన... అద్భుత ప్రదర్శనతో ఇరగదీశాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతూ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో రాటుతేలిన ఈ 20 ఏళ్ల యంగ్ పేసర్ దెబ్బకి, బంగ్లా బ్యాటర్లు బెంబేలెత్తారు.  ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, 42.4 ఓవర్లలో 164 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

ఓపెనర్ మహ్మద్ నయీం 16 పరుగులు చేయగా తన్జీద్ హసన్ డకౌట్ అయ్యాడు. బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 5 పరుగులు చేయగా తోహిద్ హృదయ్ 20 పరుగులు చేశాడు.. ముస్తాఫికర్ రహీమ్ 13, మెహిడీ హసన్ మిరాజ్ 5, మెహిదీ హసన్ 6 పరుగులు చేయగా టస్కీన్ అహ్మద్ డకౌట్ అయ్యాడు. ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో నజ్ముల్ హుస్సేన్ షాంటో 122 బంతుల్లో 7 ఫోర్లతో 89 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు.  ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా డకౌట్ కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కి  తెరపడింది.

శ్రీలంక బౌలర్లలో మతీష పతిరన 4 వికెట్లు తీయగా మతీశ్ తీక్షణ 2 వికెట్లు పడగొట్టాడు. ధనంజయ డి సిల్వ, దునిత్ వెల్లాలగే, దసున్ శనకలకు తలా ఓ వికెట్ దక్కింది. వర్షం కారణంగా కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే తిరిగి ప్రారంభమైన తర్వాత లంక బౌలర్లు, పరిస్థితులను వాడుకుంటూ చెలరేగిపోయారు..

ఒకానొక దశలో 127/4 స్కోరుతో ఉన్న బంగ్లాదేశ్, 37 పరుగుల తేడాతో మిగిలిన 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది. లంక బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలకమైన షకీబ్ అల్ హసన్, ముస్తాఫికర్ రహీం వంటి సీనియర్లను పెవిలియన్ చేర్చిన మతీష పతిరన, టస్కిన్ అహ్మద్, ముస్తాఫికర్ రెహ్మాన్‌లను డకౌట్ చేశాడు. 

7.4 ఓవర్లు బౌలింగ్ చేసిన మతీష పతిరన, 32 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మహీశ్ తీక్షణ 8 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ మెయిడిన్‌తో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !