స్టోక్స్ కోసం సచిన్ ను అవమానిస్తారా: ఐసిసిపై అభిమానులు సీరియస్

By Arun Kumar PFirst Published Aug 28, 2019, 6:31 PM IST
Highlights

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను ప్రశంసించే క్రమంలో ఐసిసి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను అవమానించింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఐసిసిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  

యాషెస్ సీరిస్ లో కేవలం ఒకే  ఒక ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ను మరోసారి హీరోని చేసింది. 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో తడబడుతున్న ఇంగ్లీష్ జట్టును అతడు సూపర్ సెంచరీ(135 పరుగులు) విజయతీరాలకు చేర్చాడు. ఇలా ఒంటిచేత్తో ఇంగ్లాండ్ ను గెలిపించి ఆసిస్ ఓటమికి కారణమైన అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ అభిమానులే కాకుండా యావత్ క్రీడా ప్రపంచం అతడి పోరాటస్పూర్తిని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. 

ఇలా యాషెస్ సీరిస్ లో అదరగొట్టిన స్టోక్స్ ను అభినందిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) కూడా ఓ ట్వీట్ చేసింది. గతంలో వరల్డ్ కప్ సమయంలో స్టోక్స్ ను ఆల్ టైమ్  గ్రేట్ క్రికెటర్ అంటూ చేసిన ట్వీట్ ను మరోసారి గుర్తుచేసింది. ''ఇంతకు ముందే  చెప్పాం కదా...'' అంటూ  గతంలో సచిన్, స్టోక్స్ ల పోటోలతో కూడిన ట్వీట్ ను జతచేసింది. దీంతో సచిన్ ఫ్యాన్స్ ఐసిసిపై ఫైర్ అవుతున్నారు. 

''కేవలం రెండు ఇన్నింగ్సుల్లో అదరగొట్టిన స్టోక్స్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్ అయితే ఇలాంటి వందల ఇన్నింగ్సులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టుండూల్కర్ ఏంటిమరీ...'' అంటూ కొందరు అభిమానులు బిసిసిఐ ని ప్రశ్నిస్తున్నారు. కొందరయితే '' ఐసిసికి మాత్రమే స్టోక్స్ గ్రేట్ క్రికెటర్ లా కనిపిస్తున్నాడు...ప్రపంచానికి మాత్రం సచినే ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్ అన్న విషయం తెలిసు.'' అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇలా గతంలో ఈ ట్వీట్ మూలంగానే తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ఐసిసి తాజాగా మరోసారి దాన్ని గెలికి మరీ అభిమానుల చేత చీవాట్లు తింటోంది. 

ప్రస్తుత  యాషెస్ సీరిస్ లో మాదిరిగానే ప్రపంచ కప్ ఫనల్లో స్టోక్స్ న్యూజిలాండ్ పై చెలరేగాడు. అతడి సూపర్ ఇన్నింగ్స్(84 పరుగులు నాటౌట్) ఫలితంగానే ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను నెరవేర్చుకోగలిగింది. మొదటిసారి ప్రపంచ కప్ ను అందుకునే అవకాశాన్ని పొందింది. దీంతో స్టోక్స్ ను పొగుడుతూ ఐసిసి ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో క్రికెట్ ప్రియులు ఐసిసిపై విరుచుకుపడ్డారు. 
 

Told you so 😉 https://t.co/b4SFcEVDWk

— ICC (@ICC)

 

click me!