టీ20లు ఆడతానంటున్న మిథాలీ: సెలక్టర్లు కరుణిస్తారా, తప్పిస్తారా..?

Published : Aug 28, 2019, 11:37 AM IST
టీ20లు ఆడతానంటున్న మిథాలీ: సెలక్టర్లు కరుణిస్తారా, తప్పిస్తారా..?

సారాంశం

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. అయితే ఆమె ఎంపిక అనుమానంగా ఉంది

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. అయితే ఆమె ఎంపిక అనుమానంగా ఉంది.

36 ఏళ్ల మిథాలీ 2021లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడతానని చెప్పినా.. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలని ఆలోచనతో ఉన్నారు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉన్నానని.. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ గురించి ఇంకా ఆలోచించలేదని మిథాలీ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఒక్కో సిరీస్‌పైనే దృష్టి పెట్టానని తెలిపారు.

మిథాలీ గొప్ప క్రికెటర్ అని అయితే ఆమె టీ20 కెరీర్‌పై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. మిథాలీ టీ20 జట్టులోకి ఎంపిక అవుతుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి