నిన్న క్లీన్ చీట్ ఇచ్చి.. ఈ రోజు అశ్విన్‌ను తప్పుబట్టిన ఎంసీసీ

By Siva KodatiFirst Published Mar 28, 2019, 3:20 PM IST
Highlights

ఐపీఎల్ 2019లో భాగంగా రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్‌ల మధ్య చెలరేగిన ‘‘మన్కడింగ్’’ వివాదం మరో మలుపు తిరిగింది

ఐపీఎల్ 2019లో భాగంగా రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్‌ల మధ్య చెలరేగిన ‘‘మన్కడింగ్’’ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ నిబంధన క్రికెట్‌లో తప్పనిసరిగా ఉండాలని, జరిగిన దానిలో అశ్విన్ తప్పేమి లేదని క్లీన్ చీట్ ఇచ్చిన మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇవాళ మాట మార్చింది.

అశ్విన్ ప్రవర్తన క్రీడా స్పూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఎంసీసీ  మేనేజర్ ఆఫ్ లాస్ ఫ్రేజర్ స్టీవార్డ్ గురువారం స్పందిస్తూ.. అశ్విన్ చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు.. ‘‘ ఈ ఘటనను మరోసారి సమీక్షించామని, అశ్విన్ చర్య క్రీడా స్పూర్తికి అనుకూలంగా ఉందని తాము భావించడం లేదన్నారు.

అశ్విన్ క్రీజును చేరుకునే సమయానికి... బంతి వేయాలనుకునే సమయానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందని తాము విశ్వసిస్తున్నామన్నారు. అశ్విన్ బంతి వేస్తాడని భావించి బట్లర్ క్రీజులోనే ఉన్నాడని స్టీవార్డ్ తెలిపారు.

బౌలర్ బంతి వేసే వరకు నాన్ స్ట్రైకర్ క్రీజును వదిలి వెళ్లకూడదని స్పష్టం చేసిన ఆయన.. అశ్విన్ తన డెలివరీని ఆలస్యం చేసిన తర్వాత.. బట్లర్ క్రీజులోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. 

అశ్విన్ ఏ తప్పు చేయలేదు.. మన్కడింగ్ ఉండాలి: ఎంసీసీ క్లీన్‌చీట్

click me!