ఐపిఎల్ 2019: ఉప్పల్ స్టేడియం వద్ద 2300 పోలీసులు, 300 సిసి కెమెరాలతో భద్రత

By Arun Kumar PFirst Published Mar 28, 2019, 2:25 PM IST
Highlights

ఐపిఎల్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వడానికి ఉప్పల్ స్టేడియం రెడీ అవుతోంది. ఈ ఐపిఎల్ సీజన్లో హైదరాబాద్ లో మొట్టమొదటి మ్యాచ్ ఆదివారం జరగునుంది. ఇలా హోంగ్రౌండ్ లో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ సీజన్లో హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి మ్యాచ్ కావడం...ప్రత్యర్థి టీంలో కూడా విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి స్లార్లుండటంతో వారిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు మైదానానికి తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఉప్పల్ స్టేడియం పటిష్ట భద్రత ఏర్పాటుచేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. 

ఈ మ్యాచ్ కోసం చేపడుతున్న భద్రతా చర్యల గురించి సిపి గురువారం మీడియాకు వివరించారు. 38 వేల కెపాసిటీ కలిగిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం లోపల, బయట గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు...ఇప్పటినుండే దానిపై నిఘా వుంచినట్లు తెలిపారు. ఇలా స్టేడియం పరిసరాల్లో 300 సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటి ద్వారా ప్రతిక్షణం స్టేడియం పరిసరాలపై నిఘా వుంచినట్లు తెలిపారు. 

ఇక ఐపీఎల్ మ్యాచులు జరిగే సమయంలో 2300 పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామన్నారు. ఆటగాళ్లు, వీఐపిలతో పాటు అభిమానులకు ప్రత్యేక మార్గాల్లో స్టేడియంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులకు అందుబాటులో వుండేలా మెట్రో అధికారులతో చర్చించి మెట్రోరైలు రాత్రి 12గంటల వరకు నడిచేలా ఏర్పాట్లు చేశామని సిపి వెల్లడించారు. 

 ఆదివారం జరిగే ఎస్సార్‌హెచ్, ఆర్సిబి మ్యాచ్ కోసం ఇప్పటికే భద్రతా పరమైన చర్యలు పూర్తి చేశామని తెలిపారు. స్టేడియం లోపల, పరిసరాల్లో డాగ్ స్వాడ్, బాంబ్ శ్వాడ్ తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. అలాగే మైదానంలోనే ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభిమానులు పోలీసుల భద్రతా పరమైన ఆదేశాలను, సూచనలను పాటించి వారికి సహకరించాలని సిపి భగవత్ సూచించారు.   

click me!