
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ.. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా మళ్లీ ఆడాలని నిర్ణయించున్నాడు.
Also Read:నేను ప్రపంచ కప్ ఆడతానంటే మా క్రికెట్ బోర్ట్ వద్దంటోంది: డివిలియర్స్
ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ డివిలియర్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే దక్షిణాఫ్రికా హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్‌ను నియమించడంతో ఏబీలో ఆశలు చిగురించాయి. పునరాగమనంపై సహచరుడు, సన్నిహితుడైన డివిలియర్స్‌ను తానే స్వయంగా అడుగుతానని బౌచర్ తెలిపాడు.
Also Read:డివిలియర్స్ పునరాగమనం ఎందుకు జరగలేదంటే: కెప్టెన్ డుప్లెసిస్
అతనొక అత్యుత్తమ ఆటగాడని.. ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఏబీలో ఉందని బౌచర్ కొనియాడాడు. డివిలియర్స్‌తో పాటు మరికొంతమంది రిటైర్డ్ ఆటగాళ్లతో సైతం చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని బౌచర్ ప్రకటించాడు.
త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అత్యుత్తమ జట్టును తయారు చేయడమే తన ముందున్న లక్ష్యమని బౌచర్ స్పష్టం చేశాడు. జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించడానికే తనను కోచ్‌గా ఎంపిక చేశారని బౌచర్ పేర్కొన్నాడు.