నేను ఉండి ఉంటే, సీదా అవుట్ ఇచ్చేవాడివి కదా... నితీన్ మీనన్‌తో విరాట్ కోహ్లీ! అంపైర్ రియాక్షన్ చూస్తే...

Published : Mar 13, 2023, 01:53 PM IST
నేను ఉండి ఉంటే, సీదా అవుట్ ఇచ్చేవాడివి కదా... నితీన్ మీనన్‌తో విరాట్ కోహ్లీ! అంపైర్ రియాక్షన్ చూస్తే...

సారాంశం

అంపైర్స్ కాల్ కారణంగా బతికిపోయిన ట్రావిస్ హెడ్... అతని ప్లేస్‌లో నేను ఉండి ఉంటే, అవుట్ ఇచ్చేవాడివి కదా... అంటూ అంపైర్‌ని ట్రోల్ చేసిన విరాట్ కోహ్లీ.. అవునంటూ సిగ్నల్ ఇచ్చిన నితీన్ మీనన్.. 

అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఐదో రోజు మొదటి 50 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగారు భారత బౌలర్లు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో చెలరేగగా ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్, టెస్టు సిరీస్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు..

ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని ఆడడంలో ట్రావిస్ హెడ్ పూర్తిగా మిస్ అయ్యాడు. టీమిండియా అవుట్ కోసం అప్పీలు చేయగా, ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్, నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకుంది భారత జట్టు...

టీవీ రిప్లైలో బంతి వికెట్ల ఎడ్జ్‌కి తాకుతున్నట్టు కనిపించడంతో థర్డ్ అంపైర్, అంపైర్స్ కాల్‌గా ప్రకటించాడు. ఈ సమయంలో  స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ... ‘అదే నేను బ్యాటింగ్ చేస్తుంటే... అవుట్ ఇచ్చేవాడివి కదా...’ అంటూ అరిచాడు. ఆ మాటలకు నవ్విన నితీన్ మీనన్, ‘అవును... ’ అంటూ అవుట్ సిగ్నల్ చూపించాడు...

భారత్‌లో బెస్ట్ అంపైర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నితీన్ మీనన్‌కి, విరాట్ కోహ్లీకి మధ్య వైరం ఈనాటికి కాదు. దాదాపు రెండేళ్ల నుంచి విరాట్ కోహ్లీ, నితీన్ మీనన్ వివాదాస్పద నిర్ణయాల వల్ల బలి అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలోనూ విరాట్ కోహ్లీ, ఇదే విధంగా పెవిలియన్ చేరాల్సి వచ్ిచంది...

ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 84 బంతుల్లో 44 పరుగులు చేసి హాఫ్ సెంచరీ వైపు సాగుతున్నట్టు కనిపించాడు విరాట్ కోహ్లీ. అయితే తొలి మ్యాచ్ ఆడుతున్న మ్యాట్ కుహ్నేమన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బంతి మిస్ చేయడం, ఆస్ట్రేలియా అప్పీలు చేయడం... ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్ అవుట్ ఇవ్వడం జరిగిపోయాయి..

విరాట్ కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకున్నా, టీవీ రిప్లైలో బంతి అంపైర్స్ కాల్‌గా తేలడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే జరిగింది. టీవీ రిప్లైలో బంతి బ్యాటుకి, ప్యాడ్‌కీ ఒకేసారి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే ప్రాధాన్యం ఇచ్చిన థర్డ్ అంపైర్, విరాట్ కోహ్లీ అవుట్ అయినట్టు ప్రకటించాడు...

ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆగ్రహం వ్యక్తం చేయడం, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అంపైర్లతో దీని గురించి చర్చించడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. అంతకుముందు 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ ఇదే విధంగా నితీన్ మీనన్ నిర్ణయానికి డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...

అజాజ్ పటేల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి తొలుత బ్యాట్‌కి తాకినట్టు టీవీ రిప్లైలో కనిపించినా దాన్ని పరిగణించని థర్డ్ అంపైర్ నితీన్ అంపైర్, అవుట్‌గా ప్రకటించాడు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో ఇది నాలుగో డకౌట్.. ఈ సమయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకుని, నిర్ణయం తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి...
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?