హర్ధిక్ పాండ్యా హెలికాప్టర్ షాట్లపై ధోని ఏమన్నాడంటే...

By Arun Kumar PFirst Published Apr 20, 2019, 2:38 PM IST
Highlights

హార్ధిక్ పాండ్యా... కొద్దిరోజుల క్రితం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. అలా విమర్శించిన అభిమానుల నోటి నుండే ఇప్పుడు ప్రశంసలను అందుకుంటున్నాడు. ఐపిఎల్ సీజన్ 12లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతలో అదరగొడుతూ వివాదాలతోనే కాదు ఆటతీరుతోనూ తాను వార్తల్లో నిలుస్తానని నిరూపించుకున్నాడు. మరీ ముఖ్యంగా ధోని మార్క్ హెలికాప్టర్ షాట్లతో రెచ్చిపోతున్న పాండ్యా ముంబైకి అద్భుత విజయాలను అందింస్తున్నాడు. అయితే ఈ హెలికాప్టర్ షాట్లు ఆడటం కంటే వాటిపై ధోని స్పందనే తనకు ఎక్కువ ఆనందాన్ని కలిగించిందని పాండ్యా తాజాగా వెల్లడించాడు. 

తన హెలికాప్టర్ షాట్లపై ధోనితో జరిగిన సంభాషణను పాండ్యా బయటపెట్టాడు. తన హెలికాప్టర్ షాట్లపై ధోని స్పందన ఏంటో తెలుసుకునేందుకు నేరుగా ఆయన రూంకి వెళ్లానని పాండ్యా తెలిపాడు. నా తరహా  హెలికాప్టర్ షాట్లు ఎలా వున్నాయంటూ ఆయన్ని ప్రశ్నించగా...అద్భుతంగా వున్నాయని ధోని ప్రశంసించారని వెల్లడించాడు. ఆ సమయంలో తన ఆనందానికి అవధులే లేకుండా పోయిందని పాండ్యా అన్నాడు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం డిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడి ముంబై ఇండియన్స్ సునాయాస విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ముంబై జట్టు సమిష్టిగా రాణించి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగి ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు పాండ్యా బ్రదర్స్ చెలరేగడంతో  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించగలిగింది. ఇలా జట్టుకు పరుగులు సాధించిపెట్టే క్రమంలో హార్ధిక్ పాండ్యా ధోని స్టైల్ షాట్ తో అభిమానులను అలరించాడు. 

ఢిల్లీ స్టార్ బౌలర్ రబాడ వేసిన చివరి ఓవర్‌లో హార్ధిక్ కళ్లు చెదిరే భారీ సిక్సర్ బాదాడు. ధోనికి మాత్రమే సాధ్యమైన హెలికాప్టర్ షాట్ తో బంతిని స్టాండ్ కు పంపించాడు. ఇలా లెగ్‌స్టంప్‌పై పడ్డ బంతిని బలంగా బాది బ్యాట్ ను గింగిరాలు తిప్పుతూ డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన ఈ భారీ అభిమానుల మనసును దోచుకుంది. మరీ ముఖ్యంగా ధోని అభిమానులు పాండ్యా సిక్సర్ ను మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. నిజంగానే  ఇది అచ్చు మా బాస్(ధోని) స్టైల్లోనే వుందని సంబరపడుతున్నారు. 

169 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన డిల్లీ నిర్ణీత ఓవర్లలో 128 పరుగులకే చేతులెత్తేసి ఘోర ఓటమిని చవిచూసింది. ఇలా ముంబైకి మరో విజయం అందించడంతో కీలకంగా వ్యవహరించడం, హెలికాప్టర్ షాట్లకు ధోని ప్రశంసించడంతో తనకు డబుల్ బోనాంజా లభించినట్లయిందని పాండ్యా తెలిపాడు.  

🚁 - Approved ✅ pic.twitter.com/0IpPFPaMdc

— Mumbai Indians (@mipaltan)

click me!