IPL 2025: మార్ష్, మార్క్రమ్ మెరుపులు, పూరన్ పూనకాలు.. లక్నో 205 భారీ స్కోరు

Arun Kumar P   | ANI
Published : May 19, 2025, 10:41 PM IST
Aiden Markram and Mitchell Marsh (Photo: @IPL/X)

సారాంశం

ఎకాన స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 205/7 స్కోరు సాధించింది. మిచెల్ మార్ష్ (65), ఐడెన్ మార్క్రమ్ (61) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా, నికోలస్ పూరన్ (45) చివరి ఓవర్లలో చెలరేగాడు.

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ సాగుతోంది. సోమవారం ఎకాన స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 205/7 స్కోరు సాధించింది. మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్‌ల దుమ్మురేపే బ్యాటింగ్, నికోలస్ పూరన్ చివరి ఓవర్లలో చెలరేగడంతోఎల్ఎస్జి భారీ స్కోరు చేసింది. మార్ష్ 65, మార్క్రమ్ 61 పరుగులతో LSGకి మంచి పునాది వేశారు. పూరన్ 45 పరుగులతో మెరిపించాడు.

హైదరాబాద్ టాస్ గెలిచి లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించాక మార్ష్, మార్క్రమ్ దూకుడుగా ఆడారు. మార్ష్ మొదటి బంతికే ఫోర్ కొట్టాడు. 
నాలుగో బంతికి సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన బంతిని సిక్సర్ కొట్టాడు. తర్వాతి ఓవర్లో హర్ష్ దూబే బంతిని సిక్సర్ కొట్టి తన ఉద్దేశం ఏంటో చూపించాడు. 

ఇక మూడో ఓవర్లో మార్క్రమ్ కూడా ఫోర్ కొట్టాడు. ఇషాన్ కిషన్ స్టంపింగ్ మిస్ చేయడంతో మార్క్రమ్‌కు లైఫ్ లైన్ దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకుని మార్క్రమ్ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. పవర్‌ప్లే తర్వాత మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనికేత్ వర్మ క్యాచ్ వదిలేయడంతో మార్క్రమ్‌కు మరో లైఫ్ లైన్ దక్కింది

9వ ఓవర్లో లక్నో 100 పరుగులు దాటింది. హైదరాబాద్ క్యాచ్‌లు వదలడం కొనసాగించింది. కిషన్ క్యాచ్ మిస్ చేశాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మార్ష్ వరుసగా ఫోర్లు కొట్టాడు.  చివరు 65 పరుగుల వద్ హర్ష్ దూబే బౌలింగ్ లో మార్ష్ ఔటయ్యాడు. ఇలా 115 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

మార్క్రమ్ (61) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక ఔటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ దూకుడుగా ఆడాడు.  పూరన్, అబ్దుల్ సమద్ చివరి రెండు ఓవర్లలో బౌండరీలు బాదారు. చివరి ఓవర్ నితీష్ రెడ్డి వేయగా 45 పరుగుల వద్ద పూరన్ రనౌట్ అయ్యాడు. ఇలా మార్ష్, మార్క్రమ్, పూరన్ చెలరేగడంతో లక్నో 200 పరుగులు భారీ స్కోరు చేసింది.  
  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !