అలా వెళ్లిపోయాడేంటి.. పంత్ ను చూసి గోయెంకాకు చిర్రెత్తినట్లుంది (Watch Video)

Published : May 19, 2025, 11:21 PM IST
అలా వెళ్లిపోయాడేంటి.. పంత్ ను చూసి గోయెంకాకు చిర్రెత్తినట్లుంది (Watch Video)

సారాంశం

పంత్ 7 పరుగులకే ఔటవ్వడంతో LSG యజమాని సంజీవ్ గోయెంకా స్టేడియం బాల్కనీ నుంచి కోపంగా వెళ్లిపోయారు. IPL 2025 లో పంత్ ఫామ్ ఎల్ఎస్జీ ప్లేఆఫ్స్ ఆశలపై నీడలు కమ్ముకుంటోంది.

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా మరోసారి కోపంతో ఊగిపోయారు. ఇవాళ లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌తో మరోసారి నిరాశపరిచాడు. ఇదే గోయెంక కోపానికి కారణమయ్యింది.

IPL 2025 సీజన్‌లో రిషబ్ పంత్ ఫామ్ బాగోలేదు. మిచెల్ మార్ష్ ఔటైన తర్వాత 115/1 వద్ద పంత్ బ్యాటింగ్ కి వచ్చాడు. ప్లేఆఫ్స్ కోసం పోరాడుతున్న LSG కి మంచి ప్రదర్శన ఇస్తాడని అందరూ ఆశించారు. కానీ పంత్ కేవలం ఏడు పరుగులకే ఈషాన్ మలింగ బౌలింగ్ లో ఔటయ్యాడు. కీలక సమయంలో ప్లాప్ షో అందరినీ నిరాశపర్చింది. 

పంత్ ఔట్ గోయెంకా తీవ్ర నిరాశకు గురిచేసినట్లుంది.  వైరల్ అయిన వీడియోలో, పంత్ ప్రదర్శనతో గోయెంకా బాల్కనీ నుంచి కోపంగా వెళ్లిపోవడం చూడవచ్చు. ప్లేఆఫ్స్ చేరడంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పంత్ ఫామ్ గోయెంకా నిరాశకు కారణమైంది.

 

 

LSG పంత్ ని 27 కోట్లకు కొనుగోలు చేసింది. IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు పంత్. తొమ్మిది సీజన్ల తర్వాత ఢిల్లీ నుంచి పంత్ LSG కి వచ్చాడు. ఈ సీజన్‌లో పంత్ 12 మ్యాచ్‌లలో 12.27 సగటుతో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు.

లక్నో ప్లేఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాలి

పంత్ ఫామ్ బాగోలేకపోయినా LSG 205/7 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 39 బంతుల్లో 65 పరుగులు చేశాడు. మార్క్రమ్ 38 బంతుల్లో 61 పరుగులు చేశాడు. పూరన్ 26 బంతుల్లో 45 పరుగులు చేశాడు.

ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. LSG ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. గత ఐదు మ్యాచ్‌లలో LSG ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ప్రస్తుతం వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భారత్ వద్దు.. పాక్ ముద్దు.. కేకేఆర్ ఆటగాడి సంచలన నిర్ణయం
ఇది కదా ఎగిరిగంతేసే వార్త అంటే.! టీ20ల్లోకి హిట్‌మ్యాన్ రీ-ఎంట్రీ