మెస్సీనా మజాకా.. ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా టీమ్‌కు గోల్డ్ ఐఫోన్స్

Published : Mar 02, 2023, 12:51 PM IST
మెస్సీనా మజాకా..  ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా టీమ్‌కు గోల్డ్ ఐఫోన్స్

సారాంశం

Lionel Messi: గతేడాది ఖతార్ వేదికగా ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్  ను లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు గెలుచుకుంది.  తన టీమ్  ప్రపంచకప్ గెలవడంతో  అర్జెంటీనా సారథి వాళ్లకు అదిరిపోయే గిఫ్ట్స్  ఇవ్వనున్నాడు. 

35 ఏండ్ల తర్వాత  అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ గెలిచింది.  గతేడాది ఖతార్ వేదికగా  ముగిసిన ఫిఫా ప్రపంచకప్  ఫైనల్ లో ఫ్రాన్స్   ను ఓడించి  టైటిల్ దక్కించుకున్న అర్జెంటీనాకు ఆ జట్టు సారథి లియోనల్ మెస్సీ అదిరిపోయే గిఫ్ట్స్ ఇవ్వనున్నాడు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉన్న సభ్యులతో పాటు స్టాఫ్ కూ ‘గోల్డ్ ఐఫోన్స్’గిఫ్ట్స్ గా ఇవ్వనున్నాడు.  మొత్తం  35 గోల్డ్ ఐఫోన్స్ ను ఇప్పటికే ఆర్డర్ చేయగా  శనివారం అవి ఆటగాళ్లకు అందనున్నాయి. 

‘ది సన్’లో వచ్చిన కథనం ప్రకారం..   24 క్యారెట్స్ గోల్డ్ తో  ఈ ఐఫోన్స్ ను  తయారుచేశారు.  వీటి విలువ  సుమారు రూ. 1.73 కోట్లుగా ఉంది. గోల్డ్ ఐఫోన్స్ మీద ఆటగాళ్ల  జెర్సీ నెంబర్, పేరు తో  పాటు అర్జెంటీనా లోగో కూడా ఉండనుంది.  

మూడున్నర దశాబ్దాల తర్వాత తమ దేశానికి  వరల్డ్ కప్ గెలిచిన  టీమ్ కు మెస్సీ (తాను కూడా సభ్యుడే)  కెప్టెన్ హోదాలో ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. అందుకే    ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన  ‘ఐడిజైన్ గోల్డ్’ సీఈవో బెన్ తో చర్చలు జరపగా   అతడు  ఈ ‘గోల్డ్ ఐఫోన్స్’ఐడియా చెప్పాడట.  వెంటనే ఈ ఐడియా నచ్చిన మెస్సీ.. వాటికోసం ఆర్డర్ ఇచ్చాడు.  సాధారణంగా ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో కెప్టెన్లు ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి ఖరీదైన వాచ్ లు ఇస్తారు. కానీ  ఫిఫా వరల్డ్ కప్ అనేది అర్జెంటీనాకు  ఎంత ప్రత్యేకమో  చెప్పాల్సిన పన్లేదు కావున దానిని గెలిచిన టీమ్ కు కలకాలం గుర్తుండేలా గిఫ్ట్స్ ఇవ్వాలని  మెస్సీ భావించాడని బెన్ తెలిపాడు. 

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో అర్జెంటీనా.. ఫ్రాన్స్ పై  4-2 (3-3) తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టోర్నీలో తొలి మ్యాచ్ లో సౌదీ అరేబియా చేతిలో ఓడినా తర్వాత పుంజుకున్న అర్జెంటీనా  వడివడిగా  ఒక్కో జట్టును ఓడిస్తూ  ట్రోఫీ నెగ్గింది. తద్వారా ఆ జట్టు 35 ఏండ్ల తర్వాత ప్రపంచకప్  నెగ్గింది. 

 

ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా టీమ్ :  ఎమి మార్టిన్, ఫ్రాంకో అర్మనీ,  రుల్లి, మార్కోస్ అకున,  జువన్ ఫియోత్, లిసాండ్రో మార్టిన్, నికోలస్ టగ్లిఫికో, క్రిస్టియన్ రొమోరో, నికోలస్ ఒటమెండి, నహ్యూల్ మోలినా, గొంజలొ మోంటీల్, జెర్మన్ పెజెల్ల, ఏంజెల్ డి మరియా, లియాండ్రో పరేడెస్, రొడ్రిగొ డి పాల్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, ఎంజో ఫెర్నాండేజ్, పలసియోస్, గైడో రొడ్రిగ్స్, లియోనల్ మెస్సీ, లాటరొ మార్టిన్, పాలో డ్యబల, ఏంజెల్ కొరోయ, జులియన్ అల్వరెజ్, తియాగో అల్మడ, అల్జెండ్రో గొమెజ్ 

ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా విన్నింగ్  స్క్వాడ్ 26 మంది కాగా మిగిలిన 9 మంది  సపోర్ట్  స్టాఫ్ ఉన్నారు. వీరందరికీ మెస్సీ అందించే  గోల్డ్ ఐఫోన్స్ శనివారం అందనున్నాయి. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?