సిరీస్ అయిపోయాక కలువు, చెబుతా! ఆసీస్ యంగ్ స్పిన్నర్‌కి రవీంద్ర జడేజా సలహా..

Published : Mar 02, 2023, 12:18 PM IST
సిరీస్ అయిపోయాక కలువు, చెబుతా! ఆసీస్ యంగ్ స్పిన్నర్‌కి రవీంద్ర జడేజా సలహా..

సారాంశం

India vs Australia: ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన మ్యాట్ కుహ్నేమన్... రవీంద్ర జడేజాని బౌలింగ్ టిప్స్ ఇవ్వాల్సిందిగా కోరిన ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్... జడ్డూ సమాధానం ఏంటంటే..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో లేని మ్యాట్ కుహ్నేమన్, ఢిల్లీ టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. నెట్స్ సెషన్స్‌లో మ్యాట్ కుహ్నేమన్ బౌలింగ్‌ ఇంప్రెస్ చేయడంతో అతన్ని తుది జట్టులోకి తీసుకొచ్చేసింది ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్...

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన మ్యాట్ కుహ్నేమన్, మహ్మద్ షమీని క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కొత్త కుర్రాడు మ్యట్ కుహ్నేమన్‌తోనే ఓపెనింగ్ చేయించాడు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్...

ఇండోర్ టెస్టులో 9 ఓవర్లు మాత్రమే వేసి 2 మెయిడిన్లతో 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు మ్యాథ్యూస్ కుహ్నేమన్. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కూడా కుహ్నేమన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు...

ఈ కుర్రాడి సెన్సేషనల్ స్పెల్ కారణంగానే భారత జట్టు ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మ్యాట్ కుహ్నేమన్ తండ్రి పాల్, కొడుకు ఆటను చూసేందుకు ఇండియాకి రావాలనుకున్నాడట. అయితే ఆఖరి నిమిషంలో మ్యాట్ కుహ్నేమన్‌ని ఆడించాలని డిసైడ్ కావడంతో అది వీలు కాలేదు..

ఇండోర్ టెస్టుకి ముందు హడావుడిగా ఇండియాకి బయలుదేరిన పాల్, కనెక్టింగ్ ఫ్లైట్స్ లేకపోవడం వల్ల మ్యాచ్ సమయానికి స్టేడియానికి చేరుకోలేకపోయాడు.  అయితే మొదటి రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇండోర్ స్టేడియానికి చేరుకున్న పాల్, కొడుకు ఐదు వికెట్లు తీయడాన్ని స్టేడియంలో వీక్షించాడు.. పాల్ వచ్చే సమయానికే మ్యాట్ కుహ్నేమన్ 3 వికెట్లు తీసి ఉన్నాడు.

‘‘లంచ్ బ్రేక్ టైమ్‌లో అందరూ కూడా మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ గురించే మాట్లాడారు. మిగిలిన వికెట్లు త్వరగా తీసే బాధ్యత ఈ ఇద్దరిపైనే ఉందని అన్నారు. అయితే ఆ ఛాన్స్ నాకు రావడం చాలా పెద్ద అఛీవ్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నా. టీమ్‌లో జూనియర్ ప్లేయర్‌ని, ఐదు వికెట్లు తీసిన తర్వాత బాల్‌తో టీమ్‌ని లీడ్ చేయడం చాలా స్పెషల్ ఫీలింగ్...

నేను, టాడ్ ముర్ఫీ, ఆరు నెలల ముందే చెన్నైకి వచ్చి శిక్షణ పొందాం. ఇండియాలో పిచ్‌ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు మమ్మల్ని ముందుగానే ఇక్కడికి పంపింది క్రికెట్ ఆస్ట్రేలియా. అది మాకు బాగా ఉపయోగపడింది. 

ఇండోర్ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత నేను, రవీంద్ర జడేజాని కలిశాను. ‘నాకు ఏవైనా టిప్స్ చెబుతారా?’ అని అడిగాను. జడేజా నవ్వుతూ, ‘కచ్ఛితంగా చెబుతా, కానీ ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత కలువు...’ అన్నాడు... సిరీస్ అయ్యాక మళ్లీ జడేజాని కలుస్తా...’’ అంటూ చెప్పుకొచ్చాడు మాథ్యూస్ కుహ్నేమన్..

భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సిరీస్‌లో 21 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు. నాగ్‌పూర్ టెస్టులో, ఢిల్లీ టెస్టులో ఐదేసి వికెట్ల ప్రదర్శన కనబర్చిన రవీంద్ర జడేజా, ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఇండో

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?