అతను స్మార్ట్ క్రికెటర్... ఫలితంతో సంబంధం లేదు.. కేన్ విలియమ్సన్ పై కోహ్లీ

By telugu teamFirst Published Jan 23, 2020, 2:11 PM IST
Highlights

న్యాయకత్వాన్ని జట్టు సాధించే ఫలితాలను బట్టి నిర్ణయించకూడదన్నారు. ఒక జట్టుగా సమిష్టిగా విఫలమైతేనే పరాజయాలు వస్తాయని చెప్పారు. ఇక కెప్టెన్సీతో సంబంధం ఉండదన్నారు. కెప్టెన్ గా విలియమ్సన్ జట్టును నడిపించే తీరు బాగుంటుందన్నారు.
 

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ క్రికెట్ లో విలియమ్సన్ చాలా స్మార్ట్ క్రికెటర్ అని ప్రశంసించాడు. ఒక కెప్టెన్ గా జట్టు ముందుండి నడిపించడంలో విలియమ్సన్ ది ప్రత్యేకమైన శైలి అని కోహ్లీ పేర్కొన్నాడు.

జట్టు సాధించే ఫలితాన్ని బట్టి న్యాయకత్వ లక్షణాలను నిర్ణయించలేమని కోహ్లీ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో కివీస్ వైట్ వాష్ అయినప్పటికీ అది విలియమ్సన్ కెప్టెన్సీ వైఫల్యం కాదన్నాడు.

Also Read సెహ్వాగ్ తలపై ఉన్న జట్టు కన్నా ఎక్కువగా... షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్.

న్యాయకత్వాన్ని జట్టు సాధించే ఫలితాలను బట్టి నిర్ణయించకూడదన్నారు. ఒక జట్టుగా సమిష్టిగా విఫలమైతేనే పరాజయాలు వస్తాయని చెప్పారు. ఇక కెప్టెన్సీతో సంబంధం ఉండదన్నారు. కెప్టెన్ గా విలియమ్సన్ జట్టును నడిపించే తీరు బాగుంటుందన్నారు.

జట్టులోని సభ్యులకు గౌరవం ఇవ్వడంతోపాటుు వారిపై నమ్మకం కూడా ఉంచుతాడని అతనో స్మార్ట్ క్రికెటర్ అని ప్రశంసించాడు. ఇక న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను గెలవడంపైనే దృష్టి సారించినట్లు కోహ్లి తెలిపాడు. శుక్రవారం నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సిరీస్‌ ఆరంభం కానుంది. ఇందులో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌, రెండు టెస్టుల సిరీస్‌లు ఉన్నాయి. 

click me!