
లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) 2021 సీజన్ క్లైమాక్స్‌కి చేరుకుంది. 22 మ్యాచుల పాటు సాగిన ఉత్కంఠభరిత టైటిల్ పోరులో అత్యద్భుతమైన విజాయలతో గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ ఫైనల్ ఫైట్‌కి చేరుకున్నాయి. శ్రీలంక ప్రీమియర్ లీగ్ స్థానంతో 2020లో ఎంట్రీ ఇచ్చిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) సూపర్ సక్సెస్ సాధించింది.
ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ వంటి దేశాల క్రికెటర్లతో పాటు భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొని సత్తా చాటారు. ఐదు జట్లతో మొదలైన లంక ప్రీమియర్ లీగ్‌లో గ్రూప్ స్టేజ్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో విజయాలు అందుకుని, అజేయంగా ప్లేఆఫ్స్‌కి వచ్చింది డిఫెండింగ్ ఛాంపియన్ జఫ్నా కింగ్స్. అయితే మొదటి క్వాలిఫైయర్స్‌లో గాలే గ్లాడియేటర్స్ చేతుల్లో పరాజయం చవిచూసింది జఫ్నా కింగ్స్... అయితే రెండో క్వాలిఫైయర్‌లో విజయం సాధించి, ఫైనల్‌కి చేరుకుంది జఫ్నా కింగ్స్.
శ్రీలంకలో హంబతోటలోని మహేంద్ర రాజపక్ష స్టేడియంలో నేటి సాయంత్రం 7:30 ని.లకు ఎల్‌పీఎల్ సీజన్ 2 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
డంబుల్లా జెయింట్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో జఫ్నా కింగ్స్ ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేయడంతో పాటు రహనుల్మా గుర్భజ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో డంబుల్లా జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులకు పరిమితమైంది.
ఛమికా కరుణరత్నే 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తన జట్టుకి విజయాన్ని అందించలేకపోయాడు. అంతకుముందు మొదటి క్వాలిఫైయర్‌లో జఫ్నా కింగ్స్‌ను 64 పరుగుల చిత్తు చేసిన గాలే గ్లాడియేటర్స్, నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించింది...
లీగ్‌లో 10 మ్యాచుల్లో 301 పరుగులు చేసిన డంబుల్లా జెయింట్స్ ప్లేయర్ ఫిల్ సాల్ట్, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. గాలే గ్లాడియేటర్స్ బౌలర్ సమిత్ పటేల్ 9 మ్యాచల్లో 15 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు.
గత సీజన్‌లో జఫ్నా స్టాలియన్స్ పేరుతో బరిలో దిగిన జఫ్నా కింగ్స్ జట్టు, మొట్టమొదటి సీజన్‌లో ఎల్‌పీఎల్ టైటిల్ గెలిచింది. గత సీజన్ ఫైనల్ మ్యాచ్‌లోనూ గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య ఫైనల్ పోరు జరగడం మరో విశేషం...
2020 సీజన్‌లో గాలే గ్లాడియేటర్స్ జట్టు తరుపున ఆడిన ధనుష్క గుణతిలక సీజన్‌లో 476 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అందరికంటే టాప్‌లో నిలిచాడు. అలాగే జఫ్నా కింగ్స్ తరుపున బరిలో దిగిన వానిందు హసరంగ, ఎల్‌పీఎల్ 2020 సీజన్‌లో 17 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.