KXIPvsMI: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు... పంజాబ్‌కి మంచి టార్గెట్...

Published : Oct 01, 2020, 09:23 PM ISTUpdated : Oct 01, 2020, 09:24 PM IST
KXIPvsMI: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు... పంజాబ్‌కి మంచి టార్గెట్...

సారాంశం

70 పరుగులతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ... పాండ్యా, పోలార్డ్ మెరుపులు...  ఆఖరి మూడు ఓవర్లలో 62 పరుగులు రాబట్టిన ముంబై ఇండియన్స్...

IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. . కాంట్రెల్ వేసిన మొదటి ఓవర్‌లోనే డి కాక్ డకౌట్ అయ్యారు. మొదటి ఓవర్‌ వికెట్ మెయిడిన్ కావడంతో నెమ్మదిగా బ్యాటింగ్ మొదలెట్టింది ముంబై. సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి రనౌట్ కాగా, గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఈ దశలో రోహిత్ శర్మ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ, ఆ తర్వాత గేర్ మార్చాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మ్యాక్స్‌వెల్ అద్భుతమైన క్యాచ్ కారణంగా అవుట్ అయ్యాడు. 

ఆఖర్లో హార్ధిక్ పాండ్యా, పోలార్డ్ మెరుపులు మెరిపించడంతో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. పాండ్యా 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయగా పోలార్డ్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !