KXIPvsMI: ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ... పంజాబ్ చిత్తు...

Published : Oct 01, 2020, 11:24 PM ISTUpdated : Oct 01, 2020, 11:31 PM IST
KXIPvsMI: ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ... పంజాబ్ చిత్తు...

సారాంశం

44 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన నికోలస్ పూరన్... భారీ లక్ష్యచేధనలో ఘోరంగా విఫలమైన టాపార్డర్, మిడిల్ ఆర్డర్... 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ముంబై ఇండియన్స్..

IPL 2020 సీజన్‌లో పటిష్ట జట్టుగా కనిపించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... వరుసగా రెండో పరాజయాన్ని చవి చూసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెఎల్ రాహుల్ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది.

ఓపెనర్ మయాంక్ అగర్వాల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 18 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు.

కరణ్ నాయర్ డకౌట్ కాగా కెఎల్ రాహుల్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 11 పరుగులు, జేమ్స్ నిషమ్ 7 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరగా రవి బిష్ణోయ్ ఒక్క పరుగు చేశాడు. కృష్ణప్ప గౌతమ్ 22, షమీ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.

రాహుల్ చాహార్‌కి 2, జస్ప్రిత్ బుమ్రా, జేమ్స్ ప్యాటిన్సన్కి 2 వికెట్లు దక్కగా కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ తలా ఓ వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?
Most Educated Cricketer : ధోనీ, కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాలో అత్యంత విద్యావంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?