‘‘ ఇది కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్.. కోటీ రూపాయలిచ్చినా ఇవ్వను ’’: తేల్చిచెప్పేసిన పాకిస్తాన్ అభిమాని

Siva Kodati |  
Published : Sep 09, 2022, 04:11 PM IST
‘‘ ఇది కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్.. కోటీ రూపాయలిచ్చినా ఇవ్వను ’’: తేల్చిచెప్పేసిన పాకిస్తాన్ అభిమాని

సారాంశం

పాకిస్తాన్‌కు చెందిన అభిమాని ఒకరు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నారు. కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను కోటి రూపాయలు ఇచ్చినా ఎవ్వరికీ ఇవ్వనని తేల్చి చెప్పాడు.   

ప్రపంచ క్రికెట్ 1019 రోజులు ఎదురుచూసిన సాయంత్రం ఇది. ఆసియా కప్‌లో భాగంగా గురువారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 101 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డు స్థాయిలో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ చేసిన 71వ సెంచరీ కాగా.. టీ20లలో తొలి సెంచరీ. ఈ ప్రదర్శన ద్వారా తన శతకాల కరువును తీర్చుకున్నాడు విరాట్. ఈ మ్యాచ్ అతనికి నిజంగా చిరస్మరణీయమైనదే... సెంచరీతో పాటు తన అభిమానులను ఖుషీ చేశాడు కోహ్లీ. శతకం చేసిన కాసేపటికే పాకిస్తాన్‌కు చెందిన విరాట్ అభిమాని.. అతను ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను పొందాడు. 

జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో మాట్లాడుతూ.. సదరు అభిమాని కోహ్లీ నుంచి ఆ అమూల్యమైన బహుమతిని ఎలా పొందగలిగాడో వెల్లడించాడు. క్రికెట్ స్టార్ల నుంచి ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌లను సేకరించే అలవాటు తనకు వుందని అతను తెలిపాడు. అతను ఏమన్నాడంటే.. ‘‘తన చేతిలో విరాట్ భయ్యా ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ వుంది. నేను చాలా అదృష్టవంతుడిని’’ అని పేర్కొన్నాడు. అయితే మీరే ఏదో ఒకరోజు ఈ బ్యాట్‌ను విక్రయించాలని అనుకుంటున్నారా అని యాంకర్ ప్రశ్నించాడు. దీనికి ఆ పాకిస్తానీ ఫ్యాన్ సమాధానమిస్తూ.. కోటి రూపాయలు ఇచ్చినా దానిని అమ్మేది లేదని తేల్చిచెప్పాడు.

పాకిస్తాన్‌కు చెందిన ఇతను దాదాపు 8 నుంచి 9 సంవత్సరాలుగా క్రికెట్ స్టార్ల నుంచి ఆటోగ్రాఫ్‌లు చేసిన బ్యాట్‌లను సేకరిస్తున్నాడు. తన వద్ద అలాంటివి దాదాపు 150కి పైగా ఇలాంటి బ్యాట్‌లు వున్నాయని చెప్పాడు. అందులో ఇమ్రాన్ ఖాన్, షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి స్టార్స్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌లు వున్నాయని ఆ అభిమాని తెలిపాడు. 

ఇకపోతే.. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ చేసిన 122 పరుగులు భారత్‌ గౌరవప్రదంగా ఆసియా కప్‌ను ముగించేలా సహాయపడింది. సూపర్ 4 దశలో పాకిస్తాన్‌, శ్రీలంకల చేతిలో ఓడిపోయిన భారత్ పరువు పొగొట్టుకుంది. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్‌పై చెలరేగి ఆడిన టీమిండియా భారీ తేడాతో విజయం సాధించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !