విరాట్ కోహ్లీ సెంచరీ... అనుష్క రొమాంటిక్ మెసేజ్..!

Published : Sep 09, 2022, 09:50 AM IST
విరాట్ కోహ్లీ సెంచరీ...  అనుష్క రొమాంటిక్ మెసేజ్..!

సారాంశం

దాదాపు 1020 రోజుల తర్వాత కోహ్లీ ఈ సెంచరీ చేయడం గమనార్హం. అభిమానుల నిరీక్షణను ఈ సెంచరీతో ఆయన ముగింపు పలికాడు. కాగా... కోహ్లి తన 71వ అంతర్జాతీయ శతకం, తొలి T20I సెంచరీని భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికకు అంకితం చేశాడు.

పరుగుల యంత్రం మళ్లీ లైన్ లోకి వచ్చింది. విరాట్ కోహ్లీ ఎప్పుడు సెంచరీ చేస్తాడా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.  కాగా... అభిమానుల కల నిన్నటి తో నెరవేరింది. గురువారం దుబాయి వేదికగా ఆసియా కప్ 2022లో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ  61 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

దాదాపు 1020 రోజుల తర్వాత కోహ్లీ ఈ సెంచరీ చేయడం గమనార్హం. అభిమానుల నిరీక్షణను ఈ సెంచరీతో ఆయన ముగింపు పలికాడు. కాగా... కోహ్లి తన 71వ అంతర్జాతీయ శతకం, తొలి T20I సెంచరీని భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికకు అంకితం చేశాడు.

అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడారు.  "బయట చాలా విషయాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. అవి నా ఆలోచనను ఎప్పటికీ మార్చలేవు. సెంచరీ చేసిన తర్వాత  నేను నా ఉంగరాన్ని ముద్దుపెట్టుకున్నాను. నేను ప్రస్తుతం ఇలా నిలబడటం మీరు చూస్తున్నారు. ఇందుకు కారణమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఈ క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన ఒక వ్యక్తి నా భార్య అనుష్క. ఈ సెంచరీని ప్రత్యేకంగా అనుష్కకు, మా కూతురు వామికకు అంకితం చేస్తున్నా. ప్రతి ఒక్కరికి తమ పక్కనే నిలబడి, మంచి చెడుల్లో భాగం అయ్యేవారు ఒకరు ఉండాలి. అలా నా జీవితంలో అనుష్క ఉంది. తను క్లిష్ట సమయాల్లో నా వెన్నంటే నిలిచింది. తన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను.’’ అంటూ కోహ్లీ ఎమోషనల్ గా పేర్కొన్నారు.

 

కాగా.... కోహ్లీ సెంచరీ తనకు అంకితమివ్వడం పట్ల అనుష్క శర్మ కూడా చాలా సంతోషించారు. కోహ్లీ ఫోటో షేర్ చేసి ఆమె రొమాంటిక్ గా స్పందించారు. ‘ఏదైనా నీకోసమే, జీవితాంతం నీతోనే’ అనే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ పెట్టారు. ఈ పోస్టు కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 1.7 మిలియన్లకు పైగా లైకులు రావడం గమనార్హం.


 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన