''కోహ్లీ గొప్ప ఆటగాడే... స్మిత్ అంతకుమించి..''

By Arun Kumar PFirst Published Sep 9, 2019, 5:45 PM IST
Highlights

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ యాషెస్ సీరిస్ లో అదరగొడుతున్నాడు. దీంతో ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. 

అంతర్జాతీయ క్రికెట్లో ఎవరు నెంబర్ వన్ ఆటగాడు... క్రికెట్ వర్గాల్లో ఇప్పుడంతా చర్చ దీనిపైనే.  ఇంతకాలం టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఒక్కడి పేరు మాత్రమే టాప్ ప్లేయర్ గా వినిపించేది. కానీ ఇటీవల యాషెస్ సీరిస్ లో వరుస సెంచరీలతో చెలరేగుతున్న స్టీవ్ స్మిత్ కోహ్లీకి గట్టి పోటీ ఇస్తున్నాడు. తాజాగా ఐసిసి ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్ లో కోహ్లీని వెనక్కినెట్టి స్మిత్ అగ్రస్ధానాన్ని ఆక్రమించాడు. దీంతో అతన్ని ఆసిస్ మాజీలు, అభిమానులతో పాటు మీడియా కూడా ఆకాశానికెత్తేస్తోంది. 

ఈ క్రమంలోనే ఆసిస్ కోచ్ జస్టిస్ లాంగర్ కోహ్లీ,స్మిత్ ల మధ్య సాగుతున్న నెంబర్ వన్ పోటీపై స్పందించాడు. ''  అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్న కోహ్లీ గొప్ప ఆటగాడే. కానీ అతడికు మించి గొప్ప ఆటగాడు స్టీవ్ స్మిత్. కోహ్లీ తెలివిగా ఆడితే...స్మిత్ కసిగా ఆడతాడు. ఏడాది నిషేధం తర్వాత అతడిలో కసి మరింత పెరిగింది. దాని ఫలితమే యాషెస్  సీరిస్ ప్రదర్శన.

మా జట్టులో ఉత్తమ బ్యాట్స్ మెన్ స్మిత్ తో పాటు ఉత్తమ్ బౌలర్ కమిన్స్ కూడా వున్నాడు. అందువల్లే ఇంగ్లాండ్ గడ్డపై స్థానిక జట్టును ఓడించగలుగుతున్నాం. స్మిత్, కమిన్స్ లు జట్టు సమస్యలను గుర్తించడమే కాదు వాటిని పరిష్కరించగలరు కూడా. ఇలా కోహ్లీ కంటే గొప్ప ఆటగాళ్లు మా జట్టులో వున్నారు.'' అని కమిన్స్  అభిప్రాయపడ్డాడు.  

అయితే ఇదే ఆస్ట్రేలియా జట్టుకు చెందిన దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ మాత్రం స్మిత్ కంటే కోహ్లీయే గొప్పవాడని పేర్కొన్నాడు. ఆసిస్ మాజీలు, అభిమానులు స్మిత్  ను వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్ మెన్ అంటూ ఆకాశానికెత్తేస్తున్న సమయంలో వార్న్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. '' స్మిత్  గొప్ప టెస్ట్ బ్యాట్స్ మనే...కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే మాత్రం గొప్పవాడు కాదు. కోహ్లీ కేవలం టెస్టుల్లోనే కాదు వన్డే, టీ20 ఫార్మాట్లలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు.  అతడు అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన రికార్డులే అందుకు నిదర్శనం. కాబట్టి కోహ్లీతో పోల్చే స్థాయి స్మిత్ ది కాదు.'' అంటూ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

click me!