బెంగళూరు టీ20లో అనుచిత ప్రవర్తన... కోహ్లీపై రిఫరీ చర్యలు

By Arun Kumar PFirst Published Sep 23, 2019, 9:22 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో డీమెరిట్ పాయింట్ చేరింది. బెంగళూరు టీ20 లో అతడు ప్రత్యర్థి బౌలర్ తో అనుచితంగా ప్రవర్తించినందుకు  రిఫరీ చర్యలు తీసుకున్నారు.   

ఇప్పటికే బెంగళూరు టీ20 ఓటమి బాధలో వున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరోషాక్ తగిలింది.  ప్రత్యర్థి బౌలర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న అంపైర్ల ఫిర్యాదుపై మ్యాచ్ రిఫరీ అతడిపై చర్యలు తీసుకున్నారు. తప్పును అంగీకరించడంతో కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ను చేర్చినట్లు మ్యాచ్ రిఫరీ రిచర్డ్స్‌సన్ వెల్లడించారు. అంతేకాకుండా మరోసారి ఇలా ప్రవర్తించకుండా అధికారికంగా హెచ్చరించి వదిలేశాడు. దీంతో ఇప్పటికే రెండు పాయింట్లున్న కోహ్లీ ఖాతాలోకి మరో డీమెరిట్ పాయింట్ చేరింది. 

సీరిస్ విజయాన్ని నిర్ణయించే మూడో టీ20లో భారత్, సౌతాఫ్రికాలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇలా బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లోకి జారుకుంది. 

ఈ సమయంలో బ్యాటింగ్ బాధ్యత మొత్తం కోహ్లీపై పడింది. దీంతో అతడు చాలా సీరియస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యూరాన్ హెన్రిక్స్ బౌలింగ్ కు దిగాడు. ఈ క్రమంలో సింగిల్ కోసం పరుగెడుతున్న కోహ్లీకి అతడు అడ్డువచ్చాడు. దీంతో అప్పటికే కాస్త కోపంగా వున్న కోహ్లీ కావాలనే అడ్డుతగులుతున్నాడని భావించి కాస్త రాష్ గా హెన్రిక్స్ ను భుజంతో ఢీకొట్టాడు. 

దీంతో ఈ విషయాన్ని హెన్రిక్స్ మైదానంలోని ఫీల్డ్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లారు. వారు మ్యాచ్ అనంతరం రిఫరీకి పిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఆయన కోహ్లీ తప్పు చేసినట్లు గుర్తించాడు. దీన్ని కోహ్లీ కూడా అంగీకరించడంతో ఫైన్ విధించకుండా ఓ డీమెరిట్ పాయింట్ తో సరిపెట్టాడు. ఇప్పటికే ఈ ఘటనపై రీఫరీ చర్యలు తీసుకున్నందుకు తాము ఎలాంటి విచారణ చేపట్టడం లేదని ఐసిసి తెలిపింది. 
 

click me!