India vs Eng:కోహ్లీ నాగినీ డ్యాన్స్.. ఫోటోలు వైరల్

Published : Aug 16, 2021, 10:39 AM ISTUpdated : Aug 16, 2021, 12:15 PM IST
India vs Eng:కోహ్లీ నాగినీ డ్యాన్స్.. ఫోటోలు వైరల్

సారాంశం

రహాన్, పూజురాలు అదరగొడుతున్న సమయంలో.. బాల్కనీలో నుంచి  కోహ్లీ ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఆనందంతో ఆయన ఏకంగా నాగినీ డ్యాన్స్ కూడా చేశారు. 

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే.  అయితే.. ఈ సీరిస్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పెద్దగా ఆకట్టుకున్నది లేదనే చెప్పాలి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో గోల్డెన్ డక్ అయిన కోహ్లీ.. సెకండ్ టెస్ట్ లో42, 20 స్కోర్లతో సరిపెట్టుకున్నాడు. అయితే.. మిగిలిన క్రికెటర్లు మాత్రం అందరగొట్టారు.

రెండో టెస్టు మ్యాచ్ లో పూజారా, అజ్యింక రహానేలు తమ పార్ట్ నర్ షిప్ లో సెంచరీ చేశారు. వీరి సెంచరీతో రెండో టెస్టులో నాలుగో రోజు ముగిసింది. ప్రస్తుతం టీమిండియా 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా..  రహాన్, పూజురాలు అదరగొడుతున్న సమయంలో.. బాల్కనీలో నుంచి  కోహ్లీ ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఆనందంతో ఆయన ఏకంగా నాగినీ డ్యాన్స్ కూడా చేశారు. 

 

దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో కోహ్లీ నాగినీ డ్యాన్స్ చేస్తుండగా.. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మహ్మద్ సిరాజ్ లు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. వారంతా కోహ్లీ డ్యాన్స్  చేస్తుండగా చూసి నవ్వుతుండటం ఆ ఫోటోల్లో స్పష్టంగా కనపడుతుంది. 

గతంలో సౌరవ్ గంగూలీ.. చొక్కా విప్పి డ్యాన్స్ చేసిన ఫోటోలు వైరల్ అవ్వగా.. తాజాగా..  కోహ్లీ నాగినీ డ్యాన్స్  ఫోటోలు కూడా వైరల్ అవుతుండటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Abhishek Sharma : సిక్సర్లే సిక్సర్లు.. అభిషేక్ శర్మ షేక్ చేశాడు ! షో అదిరింది బ్రో !
U19 World Cup : 8 సిక్సర్లు, 18 ఫోర్లు.. ఒక్కడే 191 రన్స్.. బౌలర్లని ఉతికి ఆరేసిన కుర్రాడు