పదకొండేళ్ల బాలుడి బౌలింగ్ కు రోహిత్ శర్మ ఫిదా.. భారత్ కు ఎలా ఆడతావంటూ ప్రశ్న..

Published : Oct 17, 2022, 09:04 AM IST
పదకొండేళ్ల బాలుడి బౌలింగ్ కు రోహిత్ శర్మ ఫిదా.. భారత్ కు ఎలా ఆడతావంటూ ప్రశ్న..

సారాంశం

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ పదకొండేళ్ల బాలుడిని చూసి ఫిదా అయ్యాడు. అతని బౌలింగ్ కు ముగ్దుడై నెట్స్ లో తనకు బౌలింగ్ వేయించుకున్నాడు.

పెర్త్ : వాకా మైదానంలో ఉదయం పూట స్థానిక చిన్నారులు ప్రాక్టీస్ చేస్తున్నారు. టి20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా చేరుకుని పెర్త్ లోనే సాధన చేస్తున్న టీమిండియా మధ్యాహ్నం అక్కడికి చేరుకుంది. మైదానంలోని పిల్లల్లో ఒక 11 ఏళ్ల బాలుడు తన బౌలింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. మంచి రనప్ తో బంతులు వేస్తున్న ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్  ప్రతిభకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్ధుడయ్యాడు. నెట్స్ లో అతనితో బౌలింగ్ వేయించుకున్నాడు. ఆ బాలుడి పేరు ద్రుషిల్ చౌహాన్. రోహిత్ కు అతను బౌలింగ్ చేసిన  వీడియోను బీసీసీఐ ఆదివారం పోస్ట్ చేసింది.

‘మధ్యాహ్నం ప్రాక్టీస్ సెషన్ కోసం మేము వాకా వెళ్ళాం. అక్కడ పిల్లలు ఉదయం సెషన్ ముగించుకునే పనిలో ఉన్నారు. దాదాపు  100 పిల్లలు ఆడుతుండగా డ్రెస్సింగ్ రూం నుంచి చూశాం. అందులో ఒక బాలుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా రోహిత్ దృష్టిని. అతని, సహజమయిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు నిలకడగా మంచి బంతులు వేశాడు. రోహిత్ అతని దగ్గరికి వెళ్లి తనకు నెట్స్ లో బౌలింగ్ చేయమని అడిగాడు’ అని టీమిండియా విశ్లేషకుడు ప్రసాద్ మోహన్ తెలిపాడు.

టీమిండియా కెప్టెన్‌ను గుర్తుపట్టని క్యాబ్ డ్రైవర్... రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాలో వింత అనుభవం...

ద్రుషిల్ ను జట్టు డ్రెస్సింగ్ రూంకు కూడా తీసుకు వచ్చారు. ‘ఇదంతా నాకు ఎంతో సంభ్రమాశ్చర్యాలను కలిగించింది. రోహిత్ కు బౌలింగ్ చేయాలని నాన్న నాతో చెప్పాడు. దీంతో ఎంతో ఉత్సాహంగా అనిపించింది. ఇన్ స్వింగింగ్ యార్కర్లు, అవుట్ స్వింగింగ్ బంతులు వేయడం అంటే నాకు ఇష్టం’ అని దృషిల్ చెప్పాడు. ‘నువ్వు పెర్త్ లో ఉంటున్నావు. మరి భారత్ కు ఎలా ఆడతావు’ అని ద్రుషిల్ ను  రోహిత్  ప్రశ్నించగా.. ‘ ఆటపై పట్టు సాధించిన తర్వాత భారత్ కి వెళ్తా’  అని అతను సమాధానమిచ్చాడు. 

కాగా, ఆదివారం కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాలో మరో వింత అనుభవం ఎదురైంది. ఐసీసీ నిర్వహించిన కెప్టెన్స్ డే ఈవెంట్‌లో మిగిలిన 15 జట్ల కెప్టెన్లతో కలిసి ఫోటోషూట్‌లో పాల్గొని రోహిత్ శర్మ తిరిగి క్యాబ్ ఎక్కి హోటెల్‌కి చేరుకున్నాడు. అయితే ఈ సమయంలో ఆ క్యాబ్ డ్రైవర్, టీమిండియా కెప్టెన్‌ని గుర్తు పట్టలేదు. సెక్యూరిటీ సిబ్బంది హడావుడిగా రోహిత్ శర్మను క్యాబ్ ఎక్కించడంతో ఆశ్చర్యపోయిన ఆ క్యాబ్ డ్రైవర్... ‘నువ్వు ఏం పని చేస్తావ్?’ అంటూ ప్రశ్నించాడు... దానికి రోహిత్ శర్మ ‘నేను ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌ని’ అంటూ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరలయ్యింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Virat Kohli : 15 ఏళ్ల తర్వాత కోహ్లీ రీఎంట్రీ.. వచ్చి రాగానే సెంచరీతో రచ్చ!
Rohit Sharma : 27 ఫోర్లు సిక్సర్లతో రఫ్ఫాడించిన రోహత్ శర్మ.. విజయ్ హజారే ట్రోఫీలో హిట్ మ్యాన్ షో