ఇంగ్లాండ్ తో జరిగే మూడో టెస్ట్ కు కె.ఎల్. రాహుల్ దూరమయ్యాడు. ఆరోగ్య సమస్యలతో రాహుల్ ను జట్టుకు దూరమయ్యాడు.
న్యూఢిల్లీ: రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ లో కె.ఎల్. రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఎంపికయ్యాడు. ఈ నెల 15వ తేదీన రాజ్ కోట్ లో మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కె.ఎల్. రాహుల్ మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కె.ఎల్. రాహుల్ ను మూడో టెస్ట్ లో తప్పించారు. కె.ఎల్. రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ను బీసీసీఐ ఎంపిక చేశారు. విరాట్ కోహ్లి కూడ భారత జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు కె.ఎల్. రాహుల్ కూడ దూరమయ్యారు.
నాలుగు, ఐదు టెస్టు మ్యాచ్ లకు కె.ఎల్. రాహుల్ కోలుకొనే అవకాశం ఉందని బీసీసీఐ అభిప్రాయపడింది.హైద్రాబాద్ లో జరిగిన తొలి టెస్టులో కె.ఎల్. రాహుల్ 86 పరుగులు, 22 పరుగులు చేశాడు. రెండో టెస్టులో భారత జట్టు 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. కె.ఎల్. రాహుల్ కు బెంగుళూరులోని ఎన్‌సీఏలోని పరీక్షలు చేస్తే అతను పూర్తి ఫిట్ గా లేడని తేలింది.
ఐపీఎల్ లో దేవదత్ పడిక్కల్ రాణించాడు. రంజీట్రోఫిల్లో కూడ ఇప్పటికే మూడు సెంచరీలు చేశారు. కర్ణాటక తరపున 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఎ తరపున సెంచరీ చేశాడు.
also read:India vs England 2nd test: కెఎల్. రాహుల్, రవీంద్ర జడేజా దూరం,ముగ్గురికి చోటు
దేవదత్ 31 ఫస్ట్ క్లాస్ గేమ్ లు ఆడాడు. 44.54 సగటుతో 2227 పరుగులు చేశాడు. జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ 20 మ్యాచ్ లో భారత జట్టు తరపున ఆడాడు. రంజీ ట్రోఫి మ్యాచ్ లో 151 పరుగులు చేశాడు దేవదత్.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ ప్రీత్ బుమ్రా(వైఎస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రాజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కె.ఎస్.భరత్ (వికెట్ కీపర్), ఆర్. ఆశ్విన్, రవీంద్ర జడేజా, ఆక్షయ్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, అక్షయ్ దీప్, దేవదత్ పడిక్కల్