కరోనా నుంచి కోలుకున్న శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్... టీమిండియాలోకి కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్...

Published : Feb 08, 2022, 04:58 PM ISTUpdated : Feb 08, 2022, 05:04 PM IST
కరోనా నుంచి కోలుకున్న శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్... టీమిండియాలోకి కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్...

సారాంశం

సోమవారం నిర్వహించిన పరీక్షల్లో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్‌లకు కరోనా నెగిటివ్... ఇంకా కోలుకుని రుతురాజ్ గైక్వాడ్... 

వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆరంభానికి ముందు టీమిండియాకి ఇది నిజంగా గుడ్‌న్యూసే. వన్డే సిరీస్ ఆరంభానికి ముందు కరోనా బారిన పడిన భారత క్రికెటర్లు కరోనా నుంచి కోలుకున్నారు... వన్డే సిరీస్ ఆరంభానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో భారత క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్‌లతో పాటు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన నవ్‌దీప్ సైనీ కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే...

శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్‌ల రూపంలో ఇద్దరు ఓపెనర్లు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మయాంక్ అగర్వాల్‌ను వన్డే సిరీస్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే సౌతాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత బయో బబుల్ వీడిన మయాంక్ అగర్వాల్, తిరిగి భారత జట్టులో కలవడానికి ముందు క్వారంటైన్‌లో గడపాల్సి రావడంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్‌కి మొదటి వన్డేలో ఓపెనింగ్ చేసే అవకాశం దక్కింది...

మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ కరోనా బారిన పడడంతో ముందు జాగ్రత్తగా భారీ హిట్టర్ షారుక్ ఖాన్‌‌కి వన్డే సిరీస్‌ జట్టులో అవకాశం కల్పించారు సెలక్టర్లు... అయితే సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా మొదటి వన్డేలో ఆకట్టుకోవడంతో షారుక్ ఖాన్‌కి రెండో వన్డేలో అవకాశం దక్కే ఛాన్స్‌లు తక్కువే.

చెల్లెలి పెళ్లి వేడుకలో హాజరు అయ్యేందుకు మొదటి వన్డేకి దూరంగా ఉన్న కెఎల్ రాహుల్‌తో పాటు క్వారంటైన్ పూర్తి చేసుకున్న మయాంక్ అగర్వాల్ కూడా భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నారు. కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడంతో రెండో వన్డేలో అతనికి ఓపెనర్‌గా అవకాశం దక్కొచ్చు...

తాజాగా సోమవారం నిర్వహించిన పరీక్షల్లో శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్‌లకు నెగిటివ్ వచ్చింది. అయితే యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి మాత్రం రెండోసారి చేసిన పరీక్షల్లో పాజిటివ్ రావడంతో అతను ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. కరోనా నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్... బుధవారం భారత జట్టుతో కలిసే అవకాశం ఉంది...

బుధవారం జరిగే రెండో వన్డేలో శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్ ఆడే అవకాశం లేదు. అయితే ఆ తర్వాత శుక్రవారం జరిగే మూడో వన్డే సమయనికి ఈ ఇద్దరూ జట్టుకి అందుబాటులోకి రానున్నారు. అలాగే రుతురాజ్ గైక్వాడ్‌, కరోనా నెగిటివ్‌గా తేలితే టీ20 సిరీస్‌కి అందుబాటులో ఉంటాడు... క్రికెటర్లతో పాటు కరోనా పాజిటివ్‌గా తేలిన సహాయక సిబ్బంది కూడా కరోనా నుంచి కోలుకున్నట్టు సమాచారం..

కరోనా పాజిటివ్‌గా తేలిన యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఇంతకుముందు ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముందు కూడా కరోనా బారిన పడ్డాడు. అప్పుడు ఆ ఎఫెక్ట్‌తో ఆరంభ మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు రుతురాజ్. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2021 సీజన్‌లో 636 పరుగులు చేసి, అతి పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లోనూ దుమ్మురేపాడు. అయితే ఐపీఎల్ తర్వాత అతనికి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఆడే అవకాశం రాలేదు...

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !